Balakrishna, Jr NTR: ఆ ఇంటర్వ్యూలో బాలయ్య గురించి తారక్ అంత గొప్పగా చెప్పారా?

నందమూరి హీరోలలో ప్రస్తుతం ఎక్కువ క్రేజ్ ఉన్న హీరో ఎవరనే ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. పాన్ ఇండియా హీరోగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న తారక్ రాబోయే రోజుల్లో హాలీవుడ్ ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించి ఫ్యాన్స్ ను ఒకింత ఆశ్చర్యానికి గురి చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో ఒకే వేదికపై కనిపించకపోయినా వీళ్లిద్దరి మధ్య మంచి బంధం ఉంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని ఎప్పుడు తీసుకుంటారనే ప్రశ్నకు బదులుగా నా జీవితంలో అప్పుడే రాని పేజీ గురించి నేను ఆలోచించనని అన్నారు. ప్రస్తుతం గురించి నేను ఆలోచిస్తానని ఆయన తెలిపారు. భవిష్యత్తు గురించి ఎవరూ ఏమీ చెప్పలేరని ఎన్టీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి అయిపోవడం అంటే సులువు కాదని ఆశ ఉంటే సరిపోదని తారక్ తెలిపారు.

తాతయ్య గారు బ్రతికి ఉంటే నా సక్సెస్ ను చూసేవారని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. గతానికి వెళ్లే అవకాశం ఉంటే తాతయ్యను బతికించుకోవాలని అనిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీలో అందరి కంటే బాల బాబాయ్ అంటే ఇష్టమని తారక్ పేర్కొన్నారు. బాలయ్య అద్భుతమైన మనిషి అని చాలా మంచి మనిషి అని తారక్ చెప్పుకొచ్చారు.

బాలయ్య (Balakrishna) గారు మూడీగా ఉంటారని కొంతమంది చెబుతారని అలా చెప్పడం అంటే తన దృష్టిలో తెలిసీ తెలియకుండా వాగడం అని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్న తారక్ ఈ మూవీలో తండ్రీకొడుకులుగా కనిపిస్తారని తారక్ లుక్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం జాన్వీ ఏకంగా 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus