Jr NTR: ఆ ఒక్క విషయంలో ఎన్టీఆర్ కు పోటీ ఇవ్వడం ఇతర హీరోలకు కష్టమే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  ముందువరసలో ఉంటారు. దేవర (Devara) హిందీ వెర్షన్ డబ్బింగ్ విషయంలో తారక్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తారక్ ప్రమోషన్స్ లో భాగంగా పలు షోలకు హాజరు కాగా అక్కడ తారక్ అద్భుతంగా హిందీలో మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కర్ణాటకకు వెళ్లిన సమయంలో కన్నడ భాషలో, చెన్నైకు వెళ్లిన సమయంలో తమిళంలో తారక్ అదరగొట్టారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

Jr NTR

ఏ భాషలోనైనా అద్భుతంగా, అనర్ఘళంగా మాట్లాడే విషయంలో తారక్ కు ఎవరూ సాటిరారని చెప్పవచ్చు. ఈ ఒక్క విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కు పోటీ ఇవ్వడం ఇతర స్టార్ హీరోలకు సైతం కష్టం, అసాధ్యమని చెప్పవచ్చు. దేవర సినిమా సక్సెస్ విషయంలో సైతం తారక్ యాక్టింగ్ స్కిల్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.

తారక్ యాక్టింగ్ వల్లే దేవర సినిమా రేంజ్ పెరిగిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ త్వరలో రెగ్యులర్ షూటింగ్స్ తో బిజీ అవుతున్నారు. టాలీవుడ్ హీరోల సినిమాలకు హిందీ మార్కెట్ కూడా కీలకమైన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ హిందీలో మాట్లాడటం ఆయనకు ప్లస్ అవుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. తారక్ తన బలాలను సరిగ్గా వినియోగించుకుంటున్నారని చెప్పవచ్చు.

ఈరోజు దేవర మూవీ సాధించే కలెక్షన్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టేనని సమాచారం అందుతోంది. దేవర ఐదు రోజుల్లోనే 170 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా మరో 5 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకున్నట్టు అవుతుందని చెప్పవచ్చు. దేవరకు పోటీగా మరే సినిమా లేకపోవడం లాంగ్ రన్ ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది.

‘శ్వాగ్’ పక్కా ఫ్యామిలీ మూవీ.. కంటెంట్ పై నమ్మకం ఉంది : శ్రీవిష్ణు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus