రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ విడుదలై దాదాపుగా ఏడాదిన్నర అవుతున్నా ఏదో ఒక విధంగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్ కు సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నా ఆ వార్తల్లో నిజానిజాలు మాత్రం తెలియాల్సి ఉంది.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ఫిక్షనల్ కథాంశంతో తెరకెక్కిందనే సంగతి తెలిసిందే.
సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలకు ఫిక్షనల్ కథాంశాన్ని జోడించి జక్కన్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా ఫిక్షన్ కు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. స్టువర్ట్ పురం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథకు అనుగుణంగా కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన టైగర్ నాగేశ్వరరావు మూవీ రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదల కానుంది.
నార్త్ ఇండియాలో సైతం (Tiger Nageswara Rao) టైగర్ నాగేశరరావు మూవీ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది. రవితేజ ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రవితేజ పారితోషికం 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. మార్కెట్ కు అనుగుణంగా రవితేజ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు.
దర్శకుడు వంశీ ఏడేళ్ల క్రితం నుంచి ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సైతం పెద్దగా తెలియకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. రవితేజను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. టైగర్ నాగేశ్వరరావు సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.