ఆర్ఆర్ఆర్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైనప్పటి నుంచి బాలీవుడ్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయనే చర్చ ప్రేక్షకుల మధ్య జోరుగా జరుగుతోంది. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అయినప్పటికీ ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోవడంతో చరణ్, తారక్ ఫ్యాన్స్ సైతం నిరాశ చెందారు. అయితే బాలీవుడ్ క్రిటిక్స్ ఆర్ఆర్ఆర్ కు ఏకంగా 4 రేటింగ్ ఇవ్వడంతో ఈ సినిమాపై బాలీవుడ్ ఆడియన్స్ దృష్టి పడింది.
అయితే ఈ సినిమాకు సమాన స్థాయిలో కశ్మీర్ ఫైల్స్ సినిమాకు కూడా బుకింగ్స్ జరుగుతుండటం గమనార్హం. కశ్మీర్ ఫైల్స్ సినిమా ఆర్ఆర్ఆర్ కు గండంగా మారగా సోమవారం నుంచి ఆర్ఆర్ఆర్ హిందీలో మరింత పుంజుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. శని, ఆదివారాలకు ఆర్ఆర్ఆర్ బుకింగ్స్ పరవాలేదనే స్థాయిలో ఉన్నాయి. హిందీలో కూడా ఈ సినిమాకు టికెట్ రేట్లు ఎక్కువగానే ఉండటం గమనార్హం. చరణ్, తారక్ అభినయానికి బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఫిదా అవుతున్నారు.
బాలీవుడ్ లో ఆన్ లైన్ బుకింగ్స్ కంటే కౌంటర్ బుకింగ్స్ బాగున్నాయని తెలుస్తోంది. తెలుగు రివ్యూలను మించి హిందీలో ఆర్ఆర్ఆర్ కు రేటింగ్స్, రివ్యూలు రావడం గమనార్హం. తమిళనాడు, కేరళలో కూడా ఈ సినిమాకు మంచి రేటింగ్స్ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ సంచలనాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సమానంగా ఓవర్సీస్ లో, కర్ణాటకలో ఈ సినిమా ప్రభంజనం సృష్టించిందని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ లో అంచనాలకు అందని స్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కోరుకున్న సక్సెస్ ఈ సినిమాతో దక్కిందనే చెప్పాలి. రాజమౌళి మహేష్ తో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది.