కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ పారితోషికం సైతం భారీ రేంజ్ లో ఉంది. ఒక్కో సినిమాకు 120 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్న విజయ్ కు ఇతర భాషల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. లియో సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. అయితే విజయ్ సినిమాలకు జంతు దోషం ఉందంటూ సరికొత్త సెంటిమెంట్ తెరపైకి వచ్చింది.
జంతువుల టైటిల్స్ తో తెరకెక్కిన విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయ్ నటించిన లియో సినిమా టైటిల్ కు సింహం అనే అర్థం ఉందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా యావరేజ్ టాక్ తో థియేటర్ లో ప్రదర్శితం అవుతోంది. క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు ఆశించిన రెస్పాన్స్ రాలేదు. విజయ్ నటించిన బీస్ట్ సినిమాకు మృగం అనే అనే అర్థం వస్తుంది.
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. విజయ్ నటించిన భైరవ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. భైరవ అంటే తెలుగులో కుక్క అనే అర్థం వస్తుంది. విజయ్ నటించిన పులి సినిమా 2015లో థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమా కూడా సక్సెస్ సాధించలేదు. కురువి(పిచ్చుక), సురా(షార్క్) సినిమాలు సైతం విజయ్ కు షాకిచ్చాయి.
జంతువు పేరుతో విజయ్ నటించిన సినిమాలేవీ సక్సెస్ సాధించని నేపథ్యంలో ఇకపై విజయ్ టైటిల్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.