Keerthy Suresh: హీరోయిన్‌ను ఇలా కూడా తీసేస్తారా? కీర్తిని తీసేశారు మరి!

బాలీవుడ్‌ హీరోయిన్లు అంటే కాస్త స్లిమ్‌గా ఉంటారు. సౌత్‌ హీరోయిన్లు కాస్త బొద్దుగా ఉంటారు. ఇది ఇప్పటి మాట కాదు… చాలా ఏళ్లుగా ఉన్న అనధికారిక రూల్‌ ఇది. చాలా మంది సౌత్‌ హీరోయిన్‌లు బాలీవుడ్‌కి వెళ్లి నెగ్గుకురాలేకపోతున్నారు అంటే ఇదే ప్రధాన కారణం అని అంటుంటారు. అయితే ఇప్పుడు అదే ఇబ్బందిగా మారి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) ఓ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చిందట. అంటే… సన్నబడలేదు కాబట్టి కీర్తి సురేశ్‌కు సినిమా ఛాన్స్‌ తగ్గింది అని అనుకుంటున్నారామో. కాదు కాదు, లావు తక్కువగా ఉందని ఆమెను సినిమా నుండి తప్పించారట.

కొన్ని నెలల క్రితం కీర్తి సురేశ్‌కు ఓ బాలీవుడ్‌ సినిమా ఛాన్స్‌ వచ్చింది గుర్తుందా? అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) ప్రధాన పాత్రలో రూపొందిన ‘మైదాన్’ (Maidaan) సినిమా కోసమే ఆమెను ఎంపిక చేశారు. దర్శకుడు అమిత్ శర్మ (Amit Sharma) రూపొందిస్తున్న సినిమా కావడంతో కీర్తికి బంపర్‌ ఆఫర్ అని అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో సినిమా మొదలైనప్పుడు ఆమె పేరే అనౌన్స్‌ చేశారు. అయితే కొన్నాళ్లకు ఆమె స్థానంలోకి ప్రియమణిని (Priyamani) తీసుకొచ్చింది. అప్పట్లో సినిమా నుంచి తప్పుకున్న విషయం కీర్తి చెప్పింది తప్ప కారణం చెప్పలేదు.

అయితే ఏప్రిల్ 10న ‘మైదాన్’ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మీడియాతో అమిత్ శర్మ మాట్లాడుతూ కీర్తిని తప్పించడం వెనుక కారణం చెప్పారు. సినిమాలో హీరో భార్య పాత్రకు తానొక రూపాన్ని ఊహించుకున్నారట. అప్పుడు ఆ పాత్రకు కీర్తి సరిపోతుందని అనుకుని తీసుకున్నారట. అయితే సినిమా సెట్స్‌ మీదకు వచ్చేటప్పటికి ఆమె బరువు తగ్గి సన్నబడిందట.

దీంతో ఆ పాత్రకు సూటవ్వదని ఆమె స్థానంలోకి ప్రియమణిని తీసుకున్నారట. కీర్తి ఆ రోజుల్లో ఎంత బొద్దుగా, ముద్దుగా ఉండేదో మీకు గుర్తుండే ఉంటుంది. దీంతో హీరోయిన్లు బరువు పెరగడం వల్ల సినిమాలు కోల్పోవడం చూస్తుంటాం కానీ.. ఇలా బరువు తగ్గి మారడం వల్ల ఓ సినిమా ఛాన్స్ కోల్పోవడం విచిత్రమే కదా. కానీ ఏం చేస్తాం పాత్ర అలాంటిది మరి.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus