గత రెండు రోజుల నుంచి చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మరణించగా ఈయన అంత్యక్రియలు పూర్తికాకుండానే సీనియర్ నటుడు శరత్ బాబు మరణ వార్త తెలిసి సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. అయితే శరత్ బాబు అంత్యక్రియలు పూర్తికాకుండానే మరొక నటుడి మరణ వార్త చిత్ర పరిశ్రమను ఎంతగానో కృంగదీసిందని చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలికెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.
ఈ సినిమాలో బ్రిటిష్ ఆఫీసర్ పాత్రలో నటించిన నటుడు రే స్టీవెన్సన్ నటన ఎలా ఉండేదో మనకు తెలిసిందే. అయితే ఈయన మరణించారన్న వార్త ఒక్కసారిగా చిత్ర పరిశ్రమను కృంగదీసింది. ప్రస్తుతం షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన ఉన్నట్టుండి హఠాన్మరణం చెందడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇలా ఈయన మరణించారన్న వార్త తెలియడంతో ఎన్టీఆర్ రాజమౌళి వంటి వారు సోషల్ మీడియా వేదికగా ఈయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి రే స్టీవెన్సన్ మరణించడానికి గల కారణాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటాలియన్ మీడియా రిపబ్లికా సమాచారం ప్రకారం ఈయన ఇటలీలో తన న్యూ ప్రాజెక్ట్ అయినా ‘క్యాసినో’ చిత్ర షూటింగ్ చేస్తుండగా స్టీవెన్సన్ మిస్టరీ ఇల్ నెస్ కు గురయ్యారంట.ఇలా ఉన్నఫలంగా ఆనారోగ్యానికి గురి కావడంతో వెంటనే తనని ఆసుపత్రికి తరలించారని అయితే ఆసుపత్రికి తరలించిన పెద్దగా ఫలితం లేకపోవడంతోనే ఈయన మరణించారనే వార్తను ప్రచురించింది.
ఇక (Ray Stevenson) రే స్టీవెన్సన్ ‘థోర్’ సిరీస్ తో పాపులారిటీనీ దక్కించుకున్నారు. ఇది 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు వచ్చిన కింగ్ ఆర్థర్, ది అదర్ గైస్, ది ట్రాన్స్ పోర్టర్, యాక్సిడెంట్ మ్యాన్ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈయన 1964మే 25వ తేదీ జన్మించారు. అయితే ఈయన జన్మదినం మరొక మూడు రోజులు ఉందనగా ఇలా మరణించారన్న వార్త అందరినీ ఎంతగానో కలిసివేస్తుంది.