Naresh: కార్తికేయ సినిమాను నరేష్ వదులుకోవడానికి అదే కారణమా?

డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన చిత్రం కార్తికేయ. ఈ సినిమా అప్పట్లో ఎన్నో సంచలనాలను సృష్టించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో హీరో నిఖిల్ తో పాటు కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ నటించారు. ఈ సినిమా ఎంత సూపర్ సక్సెస్ అందుకొని పాన్ ఇండియా స్థాయిలో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇలాంటి ఓ అద్భుతమైన సినిమాని అల్లరి నరేష్ వదులుకున్నారని విషయం చాలా మందికి తెలియదు. అవును కార్తికేయ సినిమాలో ముందుగా నటించే అవకాశం నిఖిల్ కి కాకుండా అల్లరి నరేష్ కు వచ్చిందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ ఈ విషయాన్ని తెలియజేశారు. ముందుగా కార్తికేయ సినిమాలో నటించే అవకాశం తనకే వచ్చిందని తెలిపారు.

డైరెక్టర్ చందు మొండేటి ముందుగా ఈ సినిమా కథను తనకు చెప్పారని, అయితే ఈ సినిమాని తాను ఒక కారణంతోనే ఈ సినిమా వదులుకున్నానని నరేష్ తెలిపారు. అయితే ఈ సినిమా వదులుకోవడానికి ఆ ఒక్క కారణం ఏంటి అనే విషయానికి వస్తే… ఈ సినిమా సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నేపథ్యంలో రూపొందింది. ఇందులో పాములు ప్రధానంగా ఉన్నాయి.

ఈ సినిమాలో పాములు సన్నివేశాలలో ఉండడంతో తాను (Naresh) ఈ సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపారు. తనకు పాములు అంటే చాలా భయం అని అందుకే ఈ సినిమాని వదులుకున్నానని తెలిపారు. సినిమాలలో కూడా ఇలా భయంకరమైన పాము సన్నివేశాలు కనుక వస్తే అలాంటి సన్నివేశాలను చూడనని ఈ సందర్భంగా నరేష్ కార్తికేయ సినిమాని వదులుకోవడానికి గల కారణాలను తెలియజేశారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus