కొన్ని వారాల క్రితం వరకు పెద్ద, మీడియం రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఈ క్రమంలో చిన్న సినిమాలకు ఛాన్స్ రాలేదు. రిలీజైన కొన్ని లో బడ్జెట్ సినిమాలు కూడా వర్కవుట్ కాలేదు. అయితే ఈ నెల మొత్తం చిన్న సినిమాలే విడుదల కాబోతున్నాయి. నెలాఖరున ‘పొన్నియిన్ సెల్వన్’ రిలీజయ్యే వరకు అన్నీ చిన్న సినిమాలే సందడి చేయబోతున్నాయి. తొలివారం ‘రంగ రంగ వైభవంగా’, ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
రెండూ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ సినిమా ఒక మోస్తరు బడ్జెట్ తో నిర్మించారు. ఇది మంచి విజయాన్ని అందుకుంది. ‘బ్రహ్మాస్త్ర’ స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదు కాబట్టి లెక్కలోకి రాదు. మూడో వారం 16వ తేదీన చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నారు. వీటిలో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’, సుధీర్ బాబు.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘శాకిని డాకిని’ సినిమాలకు కాస్త బజ్ ఉంది.
ఇవి కాకుండా మరో నాలుగైదు సినిమాలు కూడా అదే రోజున విడుదల కాబోతున్నాయి. కిరణ్ అబ్బవరం, సుధీర్ బాబులకు సక్సెస్ చాలా ముఖ్యం. మరి వారి సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి! ఇక నాల్గో వారంలో నాగశౌర్య నటించిన ‘కృష్ణ వృింద విహారి’,
శ్రీవిష్ణు ‘అల్లూరి’, సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’, శ్రీ సింహ ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో ఏ సినిమా సక్సెస్ అవుతుందో..? నెలాఖరు వారాన్ని మాత్రం టాలీవుడ్ వదిలేసింది. ఆ తరువాత దసరా సీజన్ కాబట్టి మళ్లీ పెద్ద సినిమాల హడావిడి ఉంటుంది.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!