విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య (Krishna Chaitanya) డైరెక్షన్ లో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) సినిమా అబవ్ యావరేజ్ టాక్ తో ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. విశ్వక్ సేన్ క్రేజ్ కు సితార బ్యానర్ యాడ్ కావడంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగాయి. నేహాశెట్టి (Neha Shetty) గ్లామర్, అంజలి (Anjali) యాక్టింగ్ ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయని నెటిజన్ల నుంచి కామెంట్స్ వ్యక్తమయ్యాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
సాధారణంగా నెట్ ఫ్లిక్స్ ఏ సినిమా హక్కులను కొనుగోలు చేసినా నాలుగు వారాల నిబంధనను ఫాలో అవుతుంది. ఈ సినిమా విషయంలో అవే రూల్స్ పాటిస్తారో లేక అంతకంటే ఆలస్యంగా స్ట్రీమింగ్ అవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. నాలుగు వారాల నిబంధన పాటిస్తే జూన్ 28వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది. ఈ మధ్య కాలంలో సితార బ్యానర్ సినిమాలన్నీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.
టిల్లూ స్క్వేర్ (Tillu Square) సినిమా కూడా ఈ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు ఫస్ట్ వీకెండ్ వరకు బుకింగ్స్ బాగానే ఉండగా వీకెండ్ తర్వాత కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. విశ్వక్ సేన్ కు వరుస విజయాలు దక్కడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. విశ్వక్ సేన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది.
విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ 6 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది. విశ్వక్ సేన్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ నటుడిగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. కథ అద్భుతంగా ఉంటే నందమూరి హీరోలతో కలిసి నటించడానికి సైతం విశ్వక్ సేన్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.