వేసవి సినిమాలు ఏమొస్తున్నాయి.. ఆ లెక్కేంటి.. హిట్ ట్రాక్‌ కంటిన్యూ అవుతుందా?

  • February 13, 2023 / 03:41 PM IST

సినిమా పరిశ్రమకు అందులోనూ టాలీవుడ్‌కి బాగా అచ్చొచ్చే సీజన్లు, స్టార్లు సినిమాలు రిలీజ్‌ చేయాలి అని అనుకునే సీజన్లలో సమ్మర్‌ ఒకటి. పరీక్షలు అయిపోవడం, జనాలకు కాస్త తీరిక దొరకడం వంటి కారణాలతో వేసవిలో వరుసగా సినిమాలు రిలీజ్‌ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది సమ్మర్‌ స్టార్లు లేకుండా చప్పగా ఉండబోతోందా? ప్రస్తుతం వస్తున్న వార్తలు, స్టార్ల సినిమాల స్టేటస్‌లు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా సాగితే.. 2023 సమ్మర్‌.. స్టార్లు లేకుండానే మగియబోతోంది.

సంక్రాంతి సినిమాల సమయంలో.. నెక్స్ట్‌ వచ్చే సినిమాలు ఏంటి అని చూస్తే.. పెద్ద పెద్ద సినిమాలే కనిపించాయి. స్టార్‌ హీరోలు వరుసగా రిలీజ్‌ చేస్తారు. డేట్ల సమస్య కూడా వస్తుందేమో అనిపించింది. అయితే ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితిలో సగం కూడా లేదు. అవును.. సమ్మర్‌ బరిలో ఉన్న చిరంజీవి, మహేష్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌ ఇలా అందరూ సీజన్‌ను వదిలేసుకున్నారు. దీంతో కుర్ర హీరోల సినిమాలు ఆ స్లాట్స్‌లో రాబోతున్నాయి.

సమ్మర్‌ లాంటి రెండు నెలల లాంగ్‌ రన్‌ ఉన్న సీజన్‌లో కుర్ర హీరోల సినిమాలంటే పండగే అని చెప్పాలి. అయితే విజయం సాధించాలి అనుకోండి. గతేడాది సమ్మర్‌ సీజన్‌ చూసుకుంటే మంచి మంచి సినిమాలు పడ్డాయి. కానీ సారి చూస్తే.. నాని ‘దసరా’, రవితేజ ‘రావణాసుర’ అఖిల్ ‘ఏజెంట్’, సమంత ‘శాకుంతలం’, సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’, గోపీచంద్ ‘రామబాణం’, నిఖిల్ ‘స్పై’, నాగచైతన్య ‘కస్టడీ’, వైష్ణవ్ తేజ్ సినిమా మాత్రమే కనిపిస్తున్నాయి.

దీంతో ఈ సమ్మర్‌ అంతా స్టార్లు లేకుండా నడిచిపోతుంది అని తేలిపోయింది. అయితే స్టార్‌ హీరోలు సమ్మర్‌ సీజన్‌కి తగ్గట్టుగా సినిమాలు ఎందుకు రెడీ చేయలేదో అర్థం కావడం లేదు. ఇలాంటి సీజన్‌ను వదులుకోవడానికి నిర్మాతలు ఎలా ఓకే అనుకున్నారో కూడా తెలియడం లేదు. థియేటర్లలో ఈ సినిమా రాణించకపోతే టాలీవుడ్‌ మార్కెట్‌లోకి పక్క వాళ్ల చూపులు ఎక్కువవుతాయి. అదేనండీ డబ్బింగ్‌ సినిమాల తాకిడి ఎక్కువవుతుంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus