మెగా బ్రదర్ నాగబాబుని హీరోగా నిలబెట్టాలి అని అన్నయ్య చిరంజీవి కూడా అప్పట్లో చాలా ప్రయత్నించారు. చిరు నటించిన కొన్ని సినిమాల్లో నాగ బాబుని నటింపచేసేలా చేసి.. మెల్లగా ప్రేక్షకులకు దగ్గర చెయ్యాలి అని అడుగులు వేశారు. నాగబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘హ్యాండ్సప్’ వంటి చిత్రంలో గెస్ట్ రోల్ కూడా ఇచ్చి హెల్ప్ చేశారు చిరు. అయినా నాగ బాబు సక్సెస్ కాలేదు. సరే నిర్మాతగా అయినా నాగబాబు ని నిలబెట్టాలి అనుకున్నారు.. అది కూడా వర్కౌట్ కాలేదు. ఇది పక్కన పెడితే చిరంజీవి.. నాగబాబు నిర్మాణంలో ‘రుద్రవీణ’ అనే సినిమాని చేసారు.
బాలచందర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు కానీ.. చిరు నటనకు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.’సినిమా ఆడకపోయినా.. ఈ చిత్రంలో అన్నయ్య నటనకు నేషనల్ అవార్డు వస్తే అంతే చాలు’ అని నాగబాబు కోరుకున్నారట. అయితే ‘రుద్రవీణ’ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది కానీ.. చిరుకు మాత్రం అవార్డు రాలేదు. అప్పటి నుండీ చిరుకి నేషనల్ అవార్డు వస్తే చూడాలని నాగబాబు కోరికట. 2018 లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో చరణ్ పాత్రకు నేషనల్ అవార్డు వస్తుందని అంతా అనుకున్నారు. నాగబాబు కూడా ‘చరణ్ కు అయినా ఆ అవార్డు లభిస్తే’ బాగుణ్ణు అంటూ కోరుకున్నారట.
కానీ చరణ్ కు నేషనల్ అవార్డు రాలేదు. అయితే 2019 కి గాను తెలుగు నుండీ సైరా నరసింహారెడ్డి’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ఎన్టీఆర్ మహానాయకుడు’ వంటి చిత్రాలను నేషనల్ అవార్డు జ్యూరీ పరిశీలనకు పంపించారట. వీటితో పాటు హృతిక్ రోషన్.. ‘సూపర్ 30’ , అజయ్ దేవ్‌గణ్ ‘తానాజీ’,రణ్‌వీర్ సింగ్ ‘గల్లీబాయ్’ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. మరి నాగబాబు కోరిక మేరకు ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో అయినా చిరంజీవికి.. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు లభిస్తుందేమో చూడాలి.