మొదటి ఐదు స్థానాల్లో ఉన్న హీరోయిన్లు వీళ్లే?

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు దగ్గరవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారి ఖాతాలను తెరిచి వారికి సంబంధించిన ప్రతి విషయాలను అభిమానులతో నేరుగా ముచ్చటిస్తున్నారు.ఇలా సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని సోషల్ మీడియా ద్వారా కోట్లు సంపాదిస్తున్న సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. ఇకపోతే బాలీవుడ్ నటిమనుల విషయానికి వస్తే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

ఇకపోతే సోషల్ మీడియా వేదికగా అత్యధిక ఫాలోవర్స్ కలిగిన బాలీవుడ్ నటి ఎవరు అనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోవర్స్ కలిగి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు నటి ప్రియాంక చోప్రా. ఈమె ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 80. 9 మిలియన్ ఫాలోవర్స్ లో సొంతం చేసుకుని నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలలో నటిస్తున్నప్పటికీ హాలీవుడ్ లో మాత్రం వరుస వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్నారు.

ప్రియాంక చోప్రా తర్వాత అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్ శ్రద్ధ కపూర్ అని చెప్పాలి. సాహో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటి ఇంస్టాగ్రామ్ లో 73.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె తర్వాత ప్రముఖ నేపథ్య గాయని నేహా కక్కర్ 70.4 మిలియన్ ఫాలోవర్స్ తో మూడో స్థానంలో ఉండగా అలియా భట్ 68.4 మిలియన్ ఫాలోవర్స్ తో నాలుగవ స్థానం సొంతం చేసుకున్నారు. ఇక ఐదవ స్థానంలో దీపికా పదుకొనే 68.2 మిలియన్ ఫాలోవర్స్ తో ఐదవ స్థానం సొంతం చేసుకున్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus