Bigg Boss Elimination: మిత్రా ఓటింగ్ హవా..! ఈవారం డబుల్ ఎలిమినేషన్ లో ఎవరు వెళ్లిపోతున్నారంటే..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు ఉన్నారు. అఖిల్, బిందు, అషూరెడ్డి తప్ప మిగతా హౌస్ మేట్స్ అంతా నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లలో అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో చూసినట్లయితే., మిత్రాశర్మా అందరికంటే టాప్ లో ఉండటం అనేది విశేషం. టాస్క్ పరంగా , గేమ్ పరంగా మంచి పెర్ఫామన్స్ ఇస్తూ , కేవలం తన యాటిట్యూడ్ తో, తన స్కిల్ తోనే హౌస్ లో కొనసాగుతోంది.

Click Here To Watch NOW

ఆడియన్స్ ఓట్లని కైవసం చేసుకుంటోంది. హౌస్ లో మొత్తం ఏడుగురులో ఇప్పుడు టాప్ లో ఉంది అంటే తన పవర్ అర్దం చేసుకోవచ్చు. యాంకర్ శివని సైతం డామినేట్ చేస్తూ ఓటింగ్ లో దూసుకుపోతోంది. టాప్ పొజీషన్ లో కొనసాగుతోంది. కాబట్టి ఖచ్చితంగా సేఫ్ జోన్ లోనే ఉంటుంది. ఇక తర్వాత యాంకర్ శివ కూడా సెకండ్ ప్లేస్ లో సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. బాబాభాస్కర్ కూడా ఓటింగ్ లో పర్వాలేదనిపిస్తున్నారు.

సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక మిగిలిన నలుగురులోనే ఎలిమినేషన్ ఉండబోతోంది. నటరాజ్ మాస్టర్, హమీదా, అనిల్ ఇంకా అరియానాలు లీస్ట్ లో కొనసాగుతున్నారు. నిజానికి అరియానాకి లాస్ట్ సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో చాలా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది జరుగుతోంది. అరియానా ఫ్యాన్స్ ఎవరూ కూడా హాట్ స్టార్ లో ఓటింగ్ చేయడం లేదనే చెప్పాలి. అలాగే, అన్ అఫీషియల్ సైట్స్ లో కూడా అరియానా డేంజర్ జోన్ లోనే కొనసాగుతోంది.

అయితే, ఈవారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఎవరు ఇంటి నుంచీ వెళ్లిపోతారు అనేది ఆసక్తికరంగా మారింది. నటరాజ్ మాస్టర్ కిల్లర్ టాస్క్ ని చాలాబాగా ఆడటం వల్లే ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచుకున్నారు. అలాగే, హమీదాకి కూడా ఫిక్స్ ఓటింగ్ అనేది ఫస్ట్ నుంచీ జరుగుతూనే ఉంది. కాబట్టి వీళ్లిద్దరూ సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉంది.

అలాగే, అరియానా , అనిల్ వీళ్లిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ డబుల్ ఎలిమినేట్ అయితే ఈసారి అరియానా కూడా ఇంటికి వచ్చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. లాస్ట్ టైమ్ సీజన్ 4లో టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరైన అరియానా ఈసారి మాత్రం గేమ్ లో కొద్దిగా వెనకబడిందనే చెప్పాలి. ఈ రెండు మూడు వారాలు దాటితే ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తుంది. కానీ, ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం చెప్పలేని పరిస్థితి.

నిజానికి ఈవారం ఒకటే ఎలిమినేషన్ ఉండాలి. కానీ, అనూహ్యంగా బాబాభాస్కర్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఒకవారం డబుల్ ఎలిమినేషన్ పెట్టాల్సిందే. ఇప్పుడు ఈవారమే డబుల్ ఎలిమినేషన్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం అరియానా ఇంకా అనిల్ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఈవారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో అనేది. అదీ మేటర్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus