This Weekend Movies: ఈ వారం థియేటర్ మరియు ఓటిటిలో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్..!

ఏదో అనుకుంటే ఇంకేదో అవ్వడం మన సినిమా వాళ్లకు బాగా అలవాటు. అలాగే ప్రేక్షకులకు ఇంకా బాగా అలవాటు. ఈ వారం సినిమాల సందడిని ఎంజాయ్‌ చేద్దాం అనుకున్నవాళ్లకు ఈ డైలాగ్‌ బాగా యూజ్‌ అవుతుంది అని చెప్పొచ్చు. కారణం విడుదలవుతాయి అనుకున్న ఒకటి, రెండు కొత్త సినిమాలు కూడా ఈ వారం రావడం లేదు. దీంతో పాత సినిమాల్ని ఓటీటీలో చూసుకోవడం లేదంటే వెబ్‌ సిరీస్‌లను చూసుకోవడం మాత్రమే మిగిలింది.

Click Here To Watch NOW

‘కేజీయఫ్‌ 2’ సినిమా ప్రభావమో లేక, ‘ఆచార్య’ వచ్చే వారం వస్తుంది అనో అనో, విడుదలవ్వాల్సిన సినిమాలు ఆగిపోయాయి. ‘జయమ్మ పంచాయతి’, ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ లాంటి సినిమాలు వాయిదా పడ్డాయి.

వరుణ్‌ తేజ్‌ – సయీ మంజ్రేకర్‌ ‘గని’ ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. ‘ఆహా’లో ఈ సినిమా చూడొచ్చు.

చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న హిందీ ‘జెర్సీ’ ఈ 22న వచ్చేస్తోంది. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రమిది. ఇది నాని ‘జెర్సీ’కి రీమేక్‌ అన్న విషయం తెలిసిందే.

ప్రముఖ నృత్య దర్శకుడు శేఖర్‌ సమర్పణలో… గగన్‌ విహారి, అపర్ణ దేవి జంటగా రూపొందిన చిత్రం ‘1996 ధర్మపురి’. విశ్వజగత్‌ దర్శకుడు. భాస్కర్‌ యాదవ్‌ దాసరి నిర్మాత. ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కాకుండా తెలుగులో ‘బొమ్మల కొలువు’, ‘తపన’, ‘నాలో నిన్ను దాచానే’, ‘వన్ బై టు’ లాంటి చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి.

‘హి ఈజ్ ఎక్స్‌పెక్టింగ్‌’ అనే జపనీస్ కామెడీ వెబ్ సిరీస్ ఏప్రిల్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. పురుషుడు గర్భం దాలిస్తే? అనే కాన్సెప్ట్‌లో ఈ సిరీస్‌ సిద్ధమైంది.

‘లండన్ ఫైల్స్’ అనే సిరీస్ ఏప్రిల్ 21న వూట్ ఓటీటీలో విడుదలవుతోంది. అలాగే 18న ‘బ్రోచరా’ స్ట్రీమ్‌ అవుతుంది.

అరుణ్ విజయ్ హీరోగా నటించిన ‘ఓ మై డాగ్’ అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఈ 21న విడుదలవుతోంది. తెలుగు, తమిళంలో ఈ సినిమా విడుదలవుతోంది. 22న ‘గిల్లీ మైండ్స్‌’ స్ట్రీమ్‌ అవుతుంది.

తమిళ వెబ్ సిరీస్ ‘అనంతం’ 22న జీ 5లో స్ట్రీమ్‌ అవుతుంది. ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

మలయాళ సినిమా ‘అంత్యాక్షరి’ ఈ నెల 22న విడుదల అవుతోంది. సోనీ లివ్ ఓటీటీలో ఈ సినిమా వస్తుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో ‘తులసీదాస్‌ జూనియర్‌’ (ఏప్రిల్‌ 19), ‘బెటర్‌ కాల్‌సాల్‌’ (ఏప్రిల్‌ 19), ‘కుథిరైవాల్‌’ (ఏప్రిల్‌ 20), ‘ద మార్క్‌డ్‌ హార్ట్‌’ (ఏప్రిల్‌ 20)న స్ట్రీమ్‌ అవుతా

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus