బాలీవుడ్ జనాలకు ముంబయి సేఫేనా అని గత కొన్ని రోజులుగా ఓ చర్చ నడుస్తోంది. దానికి కారణం ముంబయిలో హిందీ సినిమా జనాల భద్రత విషయంలో వరుస ఘటనలు జరుగుతుండటమే. ఇటీవల ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై (Saif Ali Khan) ఓ దుండగుడు దాడి చేశాడు. ఆ విషయంలో ఇంకా విచారణ జరుగుతున్న సమయంలోనే మరికొంతమంది బాలీవుడ్ నటులకు హత్య బెదిరింపులు వచ్చాయి. దీంతో మరోసారి ఈ విషయం చర్చనయాంశంగా మారింది.
బాలీవుడ్ కమెడియన్లు కపిల్ శర్మ, రాజ్‌పాల్ యాదవ్‌తోపాటు కొరియోగ్రాఫర్, దర్శకనిర్మాత రెమో డిసౌజాకు బెదిరింపులు వచ్చినట్లు బాలీవుడ్ మీడియా సమాచారం. విష్ణు అనే వ్యక్తి నుంచి వీరికి బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మేము మీ ప్రతి కదలికను గమనిస్తున్నాం. ఈ మెయిల్ పబ్లిక్ స్టంట్ కాదు. మిమ్మల్ని వేధించడం కోసం చేసే ప్రయత్నం కూడా కాదు. ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకోండి అని మెయిల్‌లో రాసుందట.
అంతేకాదు ఎనిమిది గంటల్లో తన డిమాండ్లు నెరవేర్చాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఆ మెయిల్‌లో రాశారట. అయితే మెయిల్ పంపిన వ్యక్తి డిమాండ్లేంటో చెప్పలేదట. ఈ హత్య బెదిరింపులపై రాజ్‌పాల్ యాదవ్ భార్య అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు ముంబయి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఈ నెల 16న సైఫ్ అలీ ఖాన్ మీద బంగ్లాదేశ్ దుండగుడు ఒకరు దాడి చేసిన కత్తి పోట్లు పొడిచిన విషయం తెలిసిందే.
అంతకుముందు సల్మాన్ ఖాన్‌కు (Salman Khan) బెదిరింపులు, దాడి ప్రయత్నాలు లాంటివి జరిగాయి. ఇప్పుడు ఇతర నటులకు బెదిరంపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌కి ముంబయి సేఫేనా అనే వాదనలు మళ్లీ బయటకు వచ్చాయి. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సైఫ్‌పై దాడి తర్వాత ఇఇ బెదిరింపుల వరకు ఆగడం లేదు అని మనకు అర్థమవుతోంది.