టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ అందుకున్న ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ తెలుగు టాప్ డైరక్టర్లు ఎదురుచూస్తున్నారు. ఎంతోమంది కథలు వినిపించినప్పటికీ తన 27 సినిమాని బాబీతో చేయడాకిని ఒకే చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడమే కాదు.. జై లవ కుశ గా ఈరోజు నామకరణం చేసుకుంది. ఈ టైటిల్ అభిమానులకు తెగ నచ్చేసింది. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అందరూ నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎవరితో ముందుకు వెలుతారోనని టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలయింది.
రాజమౌళి బాహుబలి తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ అనుకున్నారు. బాహుబలి 2 పూర్తికావడంతో ఇక తారక్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అయితే బాబీ కంటే ముందే ఎన్టీఆర్ కి కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారు. డేట్స్ క్లాష్ వల్ల వీరి కాంబినేషన్లో మూవీ పక్కన పెట్టారు. ఇక ఆది, అదుర్స్ తీసిన వినాయక్ ఖైదీ నంబర్ 150 తర్వాత ఎన్టీఆర్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి వీరి ముగ్గురిలో ఎవరి ప్రాజక్ట్ కి ఎన్టీఆర్ ఒకే చెబుతారో ఆసక్తికరంగా మారింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.