హిట్టిచ్చారు కదా అని.. పోయి పోయి మహేష్ అంత రిస్క్ చెయ్యడేమో..!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒకరి టైమే నడుస్తుంది అన్న గ్యారంటీ లేదు. ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు రేపు ప్లాప్ పొజిషన్లో ఉండచ్చు. ఈరోజు ప్లాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు రేపు టాప్ పొజిషన్లో ఉండచ్చు.. చెప్పలేము..! అయితే రిజల్ట్ ఎలా ఉన్నా.. ఫామ్ అనేది ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉండాలి. లేదంటే.. మొదటి అవకాశం ఇచ్చిన హీరోలు కూడా మొహం చాటేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే..ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఓ ముగ్గురు దర్శకులు పడిగాపులు కాస్తున్నారు. మహేష్ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్లి స్క్రిప్ట్ వినిపించి..

కన్విన్స్ చేసి సినిమా ఓకే చేయించుకోవాలి అని..వాళ్ళు వెయిట్ చేస్తున్నారట. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు అనుకుంటున్నారా? గుణశేఖర్, శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్. ఈ ముగ్గురు కూడా గతంలో మహేష్ కు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన వాళ్ళే..! ‘ఒక్కడు’ చిత్రంతో మహేష్ ను మాస్ హీరోగా చేసాడు గుణశేఖర్. ‘పోకిరి’ తో మహేష్ ను నెంబర్ వన్ రేసింగ్ లో నిలబెట్టాడు పూరి జగన్నాథ్. ఇక మహేష్ వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు ‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆదుకున్నాడు శ్రీనువైట్ల. మళ్ళీ ఈ ముగ్గురు దర్శకులు మహేష్ తో సినిమా చెయ్యాలని ఆశపడుతున్నారనేది తాజా సమాచారం.

వీరిలో పూరితో మహేష్ కు 100% సక్సెస్ రేట్ ఉంది. పైగా ‘ఇస్మార్ట్ శంకర్’ తో పూరి మళ్ళీ ఫామ్లోకి కూడా వచ్చాడు. మహేష్ అభిమానులు కూడా పూరితో సినిమా చెయ్యమని ఎప్పటినుండో ఫోర్స్ చేస్తున్నారు.కాబట్టి పూరితో మహేష్ కు ఇబ్బంది ఉండదు. కానీ ఏమాత్రం ఫామ్లో లేని గుణశేఖర్, శ్రీనువైట్ల వంటి దర్శకులతో మహేష్ ఈ టైములో సినిమా చెయ్యడమంటే చాలా కష్టం. పోయి పోయి మహేష్ కూడా అంత రిస్క్ చెయ్యడు అనేది కొందరి విశ్లేషకుల వాదన.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus