Vijay Devarakonda: థమ్స్ అప్ క్యాన్ ఎక్కిన రౌడీ హీరో!

గత కొన్ని సంవత్సరాల నుంచి సాఫ్ట్ డ్రింక్ లో నెంబర్ వన్ డ్రింక్ గా నిలిచిన థమ్స్ అప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరికొత్త రుచిని అందిస్తున్న ఈ డ్రింక్ కు ఇప్పటికే మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే ఈ కూల్ డ్రింక్ ప్రమోషన్ కోసం ప్రతి ఏడాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెద్ద హీరోలను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటూ బారీగా తమ సాఫ్ట్ డ్రింక్ ను ప్రమోట్ చేస్తోంది.

ఈ క్రమంలోనే గత ఏడాది వరకు థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు తప్పుకోవడంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఇక ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే కాకుండా, లైగర్ సినిమాతో హీరోగా గుర్తింపు పొందడంతో ఎప్పటికప్పుడు ఈ సాఫ్ట్ డ్రింక్ విజయ్ పాపులారిటీని మొదటిస్థానంలో ఉంది.

ఈ క్రమంలోనే విజయ్ తో థమ్స్ అప్ బ్రాండ్ రూపొందించిన యాడ్ ఫిల్మ్ కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా తాజాగా విజయ్ క్రేజ్ ను ఉపయోగించుకొని థమ్స్ అప్ నుంచి స్పెషల్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. అదేవిధంగా థమ్స్ అప్ క్యాన్ పై విజయ్ దేవరకొండ ఫోటో కూడా ప్రచురిస్తూ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.

ఈ విధంగా తమ అభిమాన హీరో ఫోటో ఏకంగా థమ్స్ అప్ క్యాంప్ పై రావడంతో ఎంతో మంది అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా విజయ్ కి ఉన్న క్రేజ్ ను థమ్స్ అప్ బ్రాండ్ భారీగా ఉపయోగించుకుంటున్నారు. ఇకపోతే బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారిక తాజాగా విజయ్ దేవరకొండ ఉన్నటువంటి థమ్స్ అప్ క్యాన్ కొనుగోలు చేసి రౌడీ అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus