బిగ్ బాస్ 4: టిక్కెట్ దక్కేది ఎవరికి..?

బిగ్ బాస్ హౌస్ లో ఫినాలే టిక్కెట్ కోసం రేస్ స్టార్ట్ అయ్యింది. అంబా.. అని ఆవు అరిచినప్పుడల్లా హౌస్ మేట్స్ వచ్చి పాలు పిండుకుని వారి పాలక్యాన్స్ ని నింపుకోవాలి. ఈ టాస్క్ ఇప్పుడు హౌస్ లో దుమ్మురేపబోతోంది. ముఖ్యంగా అవినాష్ కి, సోహైల్ కి సాలిడ్ పైటింగ్ జరిగింది. రీసంట్ గా రీలీజ్ చేసిన ప్రోమోలో ఇద్దరూ ఆవుపాలకోసం అరుపులు మొదలెట్టారు. నా క్యాన్ నువ్వు తోసేశావ్ నేను గేమ్ ఆడను అంటూ రెచ్చిపోయి అరిచాడు అవినాష్.

సోహైల్ కూడా చేతిలో మగ్ ని నేలకేసి కొట్టిమరీ ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ షేర్లు అవుతోంది. నిజానికి ఈ ఫినాలే టిక్కెట్ రేస్ రెండు వారాల ముందే పెట్టాలని చూసింది బిగ్ బాస్ టీమ్. కానీ , అది కుదర్లేదు…, అప్పుడు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. ఇప్పుడు 7గురు ఇంటిసభ్యులు మిగిలిన నేపథ్యంలో ఫినాలేకి ఎవరు చేరుకుంటారు. ఫైనల్ టిక్కెట్ ఎవరు సంపాదిస్తారు అని ఆసక్తికరంగా మారింది.

అయితే, ఈ టాస్క్ కేవలం లెవన్ 1 మాత్రమే. ఇక్కడ గెలిచిన వారు లెవల్ 2 కి వెళ్తారు. ఈ లెవల్ 2 లో ఇంకో టాస్క్ డిజైన్ చేసి, వారికి ఫినాలే టిక్కెట్ ఇస్తారు. మరి ఈ ఫినాలే రేస్ లో పాల క్యాన్ ఎవరు ఎక్కువ నింపుతారు. ఎవరు లెవన్ 2 కి వెళ్తారు అనేది చూడాలి.


బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus