ఈ ఏడాది చిన్న సినిమాలే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పరిమిత బడ్జెట్ తో అద్భుతమైన కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు ఊహించని స్థాయిలో లాభాలను అందిస్తుండటంతో నిర్మాతలు సంతోషిస్తున్నారు. ఓవర్సీస్ లో పుష్ప ది రైజ్ (Pushpa) రికార్డ్ ను టిల్లు స్క్వేర్ మూవీ బ్రేక్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఓవర్సీస్ లో కలెక్షన్ల పరంగా టిల్లు స్క్వేర్ మూవీ సంచలనం సృష్టించిందనే చెప్పాలి.
ఓవర్సీస్ లో మరికొన్ని గంటల్లో టిల్లూ స్క్వేర్ మూవీ 3 మిలియన్ క్లబ్ లో చేరబోతుంది. కేవలం 2 గంటల నిడివితో తెరకెక్కిన టిల్లూ స్క్వేర్ (Tillu Square) బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసి టిల్లూ క్యూబ్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది. పుష్ప ది రైజ్ ఓవర్సీస్ లో సాధించిన కలెక్షన్లను టిల్లూ స్క్వేర్ మూవీ అధిగమించడం గమనార్హం. ఓవర్సీస్ లో పుష్ప ది రైజ్ (Pushpa2) 2.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించగా టిల్లూ స్క్వేర్ సులువుగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది.
ఓవర్సీస్ లో టిల్లూ స్క్వేర్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. టిల్లూ స్క్వేర్ మూవీ విడుదలై దాదాపుగా మూడు వారాలు అవుతున్నా మిగతా సినిమాలకు పాజిటివ్ టాక్ రాకపోవడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి. అదే సమయంలో సిద్ధు జొన్నలగడ్డ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది.
వరుస సక్సెస్ లతో సిద్ధు జొన్నలగడ్డ రేంజ్ పెరుగుతోంది. ఈ సినిమా ఈ నెల చివరి వారం నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. టిల్లూ స్క్వేర్ ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.