NTR30 Title: ఎన్టీఆర్ – కొరటాల మూవీ టైటిల్ ఫిక్స్ ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసిన హీరో తర్వాతి సినిమా ప్లాప్ అవుతూ వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ కు కూడా ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఏరి కోరి కొరటాల శివ తో సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. అయితే కొరటాల శివ ఈ ఏడాది ‘ఆచార్య’ అనే భారీ ప్లాప్ ఇచ్చాడు.

నాలుగు సినిమాలతో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు,డబ్బు అంతా ఈ సినిమాతో పోగొట్టుకున్నాడు. కాబట్టి.. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలని.. స్క్రిప్ట్ పై పగలు, రాత్రి కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు.అందుకే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి 6 నెలలు కావస్తున్నా ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ 30 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు వినికిడి.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి ‘దేవర’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. నిజానికి ఈ టైటిల్ ను నిర్మాత బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమా కోసం రిజిస్టర్ చేయించి పెట్టుకున్నారు. చాలా సార్లు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ను బండ్ల గణేష్ ‘దేవర’ అంటూ సంబోధించేవారు. అయితే ఈ టైటిల్ ను రెన్యూవల్ చేయించుకోవడం బండ్ల గణేష్ మర్చిపోయారట.

దీంతో త్వరపడి కొరటాల… ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. ఇక యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా రుషిక రాజ్, అపర్ణ బాలమురళి వంటి భామలు కీలక పాత్రలకు ఎంపికైనట్టు సమాచారం.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus