Balakrishna: బాలకృష్ణకి కోపం ఎక్కువని అన్నారు.. విషయం లేట్ గా తెలిసింది!

సీనియర్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన లయ తాజాగా నందమూరి బాలకృష్ణ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈమె ‘విజయేంద్రవర్మ’ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా నటించారు. నిజానికి ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలో బాలయ్య చెల్లెలి పాత్ర కోసం ఈమెను అడిగారు. కానీ ఈమె ఏడుస్తూ నో చెప్పినట్లు వినాయక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈమెకు బాలయ్య సరసన నటించే అవకాశం 2004 లో దక్కింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది.

లయ మాట్లాడుతూ.. “విజయేంద్రవర్మ సినిమా షూటింగ్లో భాగంగా.. బాలకృష్ణగారితో ముందుగా సాంగ్ ప్లాన్ చేశారు. నేను సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆయన నా వెనుకే ఉన్నారు. కానీ నేను చూసుకోలేదు. డాన్స్ చేస్తూ ఆయన కాలు తొక్కేశాను. ‘అయ్యో సార్’ అంటూ వెనక్కి తిరిగి సారీ చెప్పే ప్రయత్నం చేశాను.

అందుకు ఆయన ‘నా కాలు తొక్కుతావా .. ప్యాకప్’ అంటూ చెప్పి వెళ్ళిపోయారు. ఆయనకు కోపం ఎక్కువని చాలా మంది చెప్పారు. నాకు కూడా ఆ భయం ఉంది. ఆ సంఘటనతో నాలో భయం ఇంకా పెరిగిపోయింది. నా వల్ల షూటింగ్ ఆగిపోయిందేంటీ అని బాధపడుతుంటే.. బాలకృష్ణ గారు నా దగ్గరికి వచ్చి .. ‘సరదాకి అలా అన్నాను.

కంగారు పడాల్సిన పనిలేదు’ అని చెప్పారు. ఆ తర్వాత ఆయన పట్ల నాకు గల భయాన్ని పోగొట్టడానికి జోకులు వేసి మరీ నవ్వించేవారు. బాలయ్య సార్ బయటికి కనిపించే దానికి పూర్తి భిన్నంగా ఉంటారు. హార్ట్ ఫుల్ గా మాట్లాడతారు. ఆయనతో డాన్స్ చేయడం చాలా కష్టం. అప్పుడు ఏదో మేనేజ్ చేసేశాను” అంటూ చెప్పుకొచ్చింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus