సినిమాలో హీరో, హీరోయిన్స్ ఎవరు? .. సినిమాకి వెళ్లేముందు సాధారణంగా అడిగే ప్రశ్న ఇది. అందుకే ముందుగా కథానాయకుడు, కథానాయికలు ఫిక్స్ అయిన తర్వాత మిగతా నటీనటులను ఎంపిక చేసుకుంటారు. అంత కీలకమైన ఈ పాత్రల్లో నటించాలంటే ప్రతిభ తో పాటు అనుభవం ఉండాలి. కానీ కొంతమంది అందమైన భామలు అతి తక్కువ వయసులోనే హీరోయిన్స్ గా అవకాశం కొట్టేశారు. లేత వయసులోనే లీడ్ రోల్స్ లో కనిపించి శెభాష్ అనిపించుకున్నారు. అటువంటి నేటి భామలపై ఫోకస్…
ఛార్మిమహా మహా అంటూ కైపెక్కించిన భారీ అందాల సుందరి ఛార్మి “నీతోడు కావాలి” మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2002 లో వచ్చిన ఈ చిత్రంలో భార్య పాత్ర పోషించి ఆకట్టుకుంది. నీతోడు కావాలి కమర్షియల్ హిట్ కాలేదు, అయినా ఛార్మికి గుర్తింపు లభించింది. ఈ చిత్రం చేస్తున్నప్పుడు ఛార్మి వయసు 15 ఏళ్లు.
తమన్నాముంబై ముద్దుగుమ్మ తమన్నా “శ్రీ” చిత్రం ద్వారా తెలుగు వారికి పరిచయమైంది. అంతకు ముందే మిల్కీ బ్యూటీ హిందీ సినిమాలో హీరోయిన్ గా మెప్పించింది. కథానాయికగా కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఆమె వయసు 15 ఏళ్లు మాత్రమే.
హన్సికపూరి జగన్నాథ్ దేశముదురు చిత్రంతో హన్సికను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేశారు. పదహారేళ్లు కూడా నిండకుండానే అల్లు అర్జున్ కి జోడీగా నటించింది. మెరిసే తన స్కిన్ టోన్ తో ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. హృతిక్ రోషన్ మూవీలో బాలనటిగా హన్సికను చూసిన వారు దేశముదురులో హీరోయిన్ గా చూసి ఆశ్చర్యపోయారు.
శ్రియ శర్మజై చిరంజీవ.. చిత్రంలో చిరంజీవి మేనకోడలుగా చిన్నారి శ్రియ శర్మ ముద్దుగా ఆకట్టుకుంది. పాల బుగ్గలు కూడా కరిగిపోక ముందే ఈమె హీరోయిన్ గా వెండి తెరపై ప్రత్యక్షమైంది. 2015 లో రిలీజ్ అయిన గాయకుడు మూవీలో కథానాయికగా నటించింది. 17 ఏళ్లకే లీడ్ రోల్ పోషించింది.
శ్వేతా బసుప్రసాద్కొత్త బంగారు లోకంలో ముద్దు ముద్దు మాటలతో యువతను పడేసిన బ్యూటీ శ్వేతా బసుప్రసాద్. ఈమె చిన్నప్పటి నుంచి టీవీల్లో అనేక సీరియల్స్ లో నటించింది. వయసుకు మించిన పాత్రలను పోషించింది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి 17 ఏళ్లకు హీరోయిన్ గా ప్రవేశించింది.
సాయేషా సైగల్బాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ కుమార్ మనమరాలు సాయేషా సైగల్ టాలీవుడ్ లోని తన 17 వ ఏటనే అడుగు పెట్టింది. అక్కినేని అఖిల్ మూవీ అఖిల్ తో హీరోయిన్ గా నటించింది.
అవికా గోరెచిన్నారి పెళ్లి కూతురిగా అవికా గోరె తెలుగు ఆడపడుచులకు పరిచయం. ఆమె పదేళ్ల నుంచే అభిమానులను సొంతం చేసుకుంది. హిందీ సీరియల్ టైటిల్ రోల్ ల్లో అద్భుతంగా నటించిన ఈ భామ “ఉయ్యాలా జంపాల” మూవీతో హీరోయిన్ గా ప్రమోషన్ అందుకుంది. అప్పుడు అవికా వయసు పదహారేళ్లు.
నందిత రాజ్ప్రేమ కథా చిత్రమ్ లో పెద్ద కళ్లతో భయపెట్టి హిట్ ని సొంతం చేసుకున్న నందితరాజ్ “నీకు నాకు డాష్ డాష్” సినిమా ద్వారా వెండితెరపై కనిపించింది. ఈ తెలుగు అమ్మాయి తొలిసినిమా అవకాశాన్ని పదహారేళ్లకే అందుకుంది.
ఉల్కా గుప్తాముంబైలో పుట్టి పెరిగిన ఉల్కా గుప్తా బాలనటిగా హీందీ సీరియల్స్ లో మెప్పించింది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ మూవీ ఆంధ్ర పోరి చిత్రంతో హీరోయిన్ గా అవతారం ఎత్తింది. వెండితెరపై కథానాయికగా కనిపించినప్పుడు ఉల్కా వయసు పదిహేడేళ్లు.
సంస్కృతి షెనాయ్కేరళ కుట్టి సంస్కృతి షెనాయ్ టెన్త్ క్లాస్ అయిపోగానే మోడలింగ్ లో అడుగుపెట్టింది. అప్పుడే సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. “హృదయం ఎక్కడుంది” అనే చిత్రంతో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. పదిహేనేళ్లకే కథానాయికగా మెప్పించింది.