సినిమాలో నటీనటులందరూ అభినయంతో ఆకట్టుకోవాల్సి ఉంటుంది. హీరో, హీరోయిన్లు మాత్రం అభినయంతో పాటు అందంతోను ఆకర్షించాల్సి ఉంటుంది. తెరపైన వీరు అందంగా కనిపించడానికి చాలా మంది కష్టపడుతుంటారు. అటువంటి వారిలో ముఖ్యమైనవారు స్టైలిస్ట్. తారలకు శరీరాకృతికి తగినైనా డ్రసులను డిజైన్ చేసి మెరిసేలా చేసే స్టైలిస్ట్స్ పై ఫోకస్…
1. నీరజ కోనతెలుగు పరిశ్రమలో ఎక్కువ పేరు దక్కించుకున్న స్టైలిస్ట్ నీరజ కోన. ప్రముఖ రచయిత కోన వెంకట్ చెల్లెలు ఈమె. రకుల్ ప్రీత్ సింగ్, సమంత, నయనతార, త్రిష , రామ్ చరణ్, అల్లు అర్జున్ .. ఇలా ఎంతోమందిని నీరజ మరింత అందంగా చూపించింది.
2. శ్రావ్య వర్మఈమె ఆర్కిటెక్చర్ చదివి, ఫ్యాషన్ లో పట్టా లేకున్నా స్టైలిస్ట్ గా పేరు తెచ్చుకుంది. విజయ్ దేవరకొండ సూపర్ హాట్ లుక్స్ వెనుకాల శ్రావ్య వర్మ ట్యాలెంట్ దాగుంది. సినీ స్టార్స్ కి మాత్రమే కాకుండా పీవీ సింధు, అశ్విని పొన్నప్ప లాంటి క్రీడాకారులకు కూడా స్టైలిస్ట్ గా పనిచేసింది.
3. గీతిక రానా దగ్గుబాటి వ్యక్తిగత స్టైలిస్ట్ గీతిక. ఢిల్లీ యూనివర్సిటీ లో కంప్యూటర్ సైన్స్ చదివి, నిఫ్ట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. రానా తో పాటు రకుల్ ప్రీత్, ప్రణీత, ఛార్మిలకు మంచి డిజైన్స్ ని గీతిక అందించింది.
4. ఇంద్రాక్షి పట్నాయక్రెజీనా, ఇంద్రాక్షి మంచి మిత్రులు. రెజీనా ప్రోత్సాహంతోనే ఇంద్రాక్షి స్టైలిస్ట్ గా ఎదిగింది. బాలీవుడ్, టాలీవుడ్ లో స్టైలిస్ట్ గా మెరిపిస్తోంది.
5. అర్చా మెహతాఅర్చా మెహతా లండన్ లో ఫ్యాషన్ కోర్స్ చేసింది. కాజల్ అగర్వాల్, హన్సిక, కాథరిన్ లకు అర్చా మెహతా అభిమాన స్టైలిస్ట్.
6. ప్రీతమ్ జుకల్కేర్హైదరాబాద్ లోని పేమస్ ఫ్యాషన్ డిజైనర్స్ లో ప్రీతమ్ జుకల్కేర్ ముందు వరుసలో ఉంటారు.
లావణ్య త్రిపాఠి, సమంతలకు స్టైలిస్ట్ గా పనిచేశారు.
7. శ్వేతా మల్పని లక్ష్మి మంచు అందం సీక్రెట్ శ్వేత మల్పని. శ్వేత సూచనలు మంచు లక్ష్మి తప్పక పాటిస్తుంది. త్రిష, మెహ్రీన్ లను కూడా అందంగా చూపించడంలో శ్వేతా సక్సస్ అయింది.
8. పల్లవి సింగ్ కాస్ట్యూమ్ డిజైనర్ అయిన పల్లవి సింగ్ తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ స్టైలిస్ట్స్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. లేటుగా కెరీర్ ప్రారంభించినప్పటికీ మంచి పేరు తెచ్చుకుంది. హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్, సౌందర్య రజనీకాంత్, సాయి పల్లవి స్టైల్ ని మార్చి ఆకట్టుకునేలా చేసింది.