టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ జర్నలిస్ట్, సినీ దర్శకుడు కె.జయదేవ్ సోమవారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి గుండె పోటుతో ఆయన కన్నుమూశారు. జయదేవ్ దర్శకత్వం వహించిన ‘కోరంగి నుంచి’ అనే సినిమాకి మంచి పేరు వచ్చింది. జాతీయ చలన చిత్రాభివృద్ది సంస్థ 2022లో నిర్మించిన ఈ సినిమాకు ప్రశంసలు కూడా కూడా దక్కాయి. ఈ సినిమాను వివిధ జాతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు.
జయదేవ్ (Jayadev) ప్రముఖ దర్శకుడు, జరలిస్టు కేఎన్‌టీ శాస్త్రికి చిన్న కుమారుడు. జయదేవ్‌కు భార్య యశోద, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేఎన్‌టీ శాస్త్రి జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ విమర్శకుడిగా పురస్కారాలు కూడా అందుకున్నారు. వివిధ విభాగాల్లో 12 అంతర్జాతీయ, ఏడు జాతీయ పురస్కారాలను పొందారాయన. జయదేవ్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు, జర్నలిస్ట్‌లు సంతాపం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!