బాలాదిత్య ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అనంతరం హీరోగా కూడా పలు సినిమాలలో నటించిన బాలాదిత్య మంచి గుర్తింపు పొందారు. ఈయన హీరోగా నటించిన 1940 లో ఒక గ్రామం సినిమాకు నంది అవార్డు కూడా వరించింది. ఈ విధంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోగా, బుల్లితెర వ్యాఖ్యాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలాదిత్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాలాదిత్య మాట్లాడుతూ తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ స్టార్ డైరెక్టర్ల సినిమాలలో నటించానని తెలిపారు. ఈ క్రమంలోనే బాలచందర్ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆయన తనని బాగా నటించావు అంటూనే చెంప దెబ్బ కొట్టినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. బాలచందర్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఓ సన్నివేశంలో ఎంతో అద్భుతంగా నటించాను. ఇదే విషయాన్ని బాలచందర్ గారు చాలా అద్భుతంగా నటించారని చెప్పి చెంపపై లాగి ఒకటి కొట్టారు.
అలా ఎందుకు కొట్టారనే విషయాన్ని ఆయన తెలుపుతూ షూటింగ్స్ లొకేషన్లో తనకు వేసిన మార్క్ దగ్గర కాకుండా మరొక స్థానంలో నిలబడి డైలాగు చెప్పడం వల్ల తన నీడ మరొక ఆర్టిస్ట్ పై పడింది. ఈ క్రమంలోనే ఆ సీన్ మంచిగా రాలేదు. దీంతో బాలచందర్ గారు తన చెంప పై ఒకటి కొట్టారని ఆయన తెలిపారు. ఆరోజు బాలచందర్ గారు కొట్టిన చెంపదెబ్బ నేను ఎప్పటికీ మర్చిపోను అని సినిమా షూటింగ్ లో పాల్గొన్న సమయంలో ఆ చెంప దెబ్బ గుర్తుకు రావడంతో తాను తన కోసం వేసిన మార్క్ లో నిలబడి సినిమాలలో నటించానని
ఈ సందర్భంగా బాలాదిత్య అప్పటి సన్నివేశాలను గుర్తు చేసుకున్నారు. కేవలం బాలచందర్ గారు మాత్రమే కాదు డైరెక్టర్ తేజ గారు కూడా సరిగా చేయకపోతే లొకేషన్లోనే కొడతారని, డైరెక్టర్ మధుసూదన రావు కూడా తనని బాగా తిట్టేవారు అంటూ ఈ సందర్భంగా బాలాదిత్య పలువురు దర్శకుల వెల్లడించారు.