Bimbisara: బింబిసార హిట్టైతే టాలీవుడ్ హీరోలు అలా చేస్తారా?

  • August 5, 2022 / 11:40 AM IST

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార మూవీ కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని నందమూరి హీరోలు, నందమూరి అభిమానులు భావిస్తున్నారు. సోషియో ఫాంటసీ మూవీగా పరిమిత బడ్జెట్ తో క్వాలిటీ గ్రాఫిక్స్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ మార్కెట్ కు 35 కోట్ల రూపాయల బడ్జెట్ రిస్క్ అయినా కథను నమ్మి కళ్యాణ్ రామ్ బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు.

అయితే విడుదలకు ముందే సినిమాపై అంచనాలు పెంచడంలో సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడంలో కళ్యాణ్ రామ్ సక్సెస్ అయ్యారు. అదే సమయంలో కథకు సంబంధించి కీలక విషయాలు లీక్ కాకుండా బింబిసార మూవీలో ఏదో కొత్తదనం ఉందని ప్రేక్షకులకు కాన్ఫిడెన్స్ కలిగించే విషయంలో సైతం కళ్యాణ్ రామ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరోవైపు ఈ మధ్య కాలంలో సోషియో ఫాంటసీ సినిమాలు తగ్గిపోయాయి. బింబిసార సినిమా సక్సెస్ సాధిస్తే ఈ తరహా సినిమాలలో నటించాలని టాలీవుడ్ హీరోలు భావిస్తున్నారు.

మరోవైపు సొంతంగా వీ.ఎఫ్.ఎక్స్ సంస్థను కలిగి ఉన్న కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో తన బిజినెస్ ను కూడా ఒక విధంగా ప్రమోట్ చేసుకున్నారు. భవిష్యత్తులో ఎక్కువ సంఖ్యలో తెలుగు సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కోసం కళ్యాణ్ రామ్ సంస్థను సంప్రదించే ఛాన్స్ ఉంది. ముంబైలోని ప్రముఖ విజువల్ ఎఫెక్స్ట్ సంస్థలు టాలీవుడ్ సినిమాలకు చెప్పిన సమయంలో విజువల్ ఎఫెక్ట్స్ పనులను పూర్తి చేయడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి సమయంలో కళ్యాణ్ రామ్ సొంత వీ.ఎఫ్.ఎక్స్ సంస్థ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఒక విధంగా బెనిఫిట్ కలిగే ఛాన్స్ ఉంది. మాస్ ప్రేక్షకులకు నచ్చే బింబిసార, క్లాస్ ప్రేక్షకులకు నచ్చే సీతారామం సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus