సినీ పరిశ్రమలో కధలు తారుమారు అవడం సర్వ సహజం. కధలు ఏంటి తారు మారు కావడం ఏంటి అనేగా మీ కన్ఫ్యూషన్. అయితే ఈ ‘కధల కధ’ చదవాల్సిందే. సహజంగా దర్శకులు ఒక హీరోనూ దృష్టిలో పెట్టుకుని ఆయన బాడీ ల్యాంగ్వేజ్ కి అనుగుణంగా కధ రాసుకుంటారు. ఇక అంతా ఒకే అయ్యి సినిమా పట్టాలు ఎక్కితే పర్వాలేదు కానీ, అలా కాకపోతేనే మరో హీరోతో ఆ సినిమా పట్టాలు ఎక్కుతుంది దానికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి అందులో కొన్ని చూద్దాం రండి.
ఈ మధ్యనే విడుదలై భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్న కృష్ణాష్టమి సినిమా అసలైతే వరుణ్ తెజ్ చెయ్యాల్సింది. అయితే ఆయన ఒప్పుకోకపోవడం వల్ల సునీల్ కు వెళ్ళింది. ఇక తాజాగా వరుణ్ చేసిన లోఫర్ సినిమా హీరో నితిన్ చేయాల్సింది కానీ, ఆది వరుణ్ కి వచ్చింది. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ తో ఒక సినిమా చెయ్యాలి అనుకున్నాడు కానీ రామ్ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో చిన్న చిన్న మార్పులతో ఆ సినిమా వరుణ్ చేతిలో పడింది.
ఇక వరుణ్ చెయ్యాల్సిన ‘ఫీల్ మై లవ్’ కధ మరో హీరో దగ్గరకు చేరింది. అంతెందుకు ఈ మధ్యనే దిల్ రాజు ‘ఎవడో ఒకడు’ టైటిల్ తో రవి తేజతో ఒక సినిమా చెయ్యాలి అనుకున్నాడు, కానీ కధ నచ్చలేదో. లేకపోతే రెమ్యూనరేషన్ సరిపోలేదో తెలీదు కానీ మొత్తానికి ఆ సినిమా సైతం ఆగిపోయి కధ వేరే హీరోకు చేరిపోయింది. ఇక పూరీ జగన్నాధ్ తాజాగా ఒక కధ రాసుకుని మహేష్ బాబుకి చెప్పడంటా, కానీ ఆ కధ అసలు రాసుకుంది ఎన్టీఆర్ గురించి. ఇలా మన చిత్ర పరిశ్రమలో కధలు అన్నీ…ఒకరి కోసం తయారయ్యి, మరొకరితో తెరకెక్కుతున్నాయి.