పరీక్షల్లో పక్కోడి పేపర్ చూసి యాజ్ ఇట్ ఈజ్ గా దింపెయ్యడం లేదా.. వాడి హెడ్డింగ్ లు కాపీ కొట్టి మన సొంత భావంలో రాసుకోవడం అనేది కాపీ అంటారు.. కానీ సినిమాల్లోకి వచ్చే సరికి దీనిని రీమేక్ లేదా అనువాదం అంటుంటారు. ఓ భాషలో హిట్టైన సినిమాని మరో భాషలోకి అనువాదం చెయ్యడం లేదా.. పరభాషా సినిమాలో హిట్ అయిన సినిమా సోల్ ను తీసుకుని నచ్చినట్టు తీసుకోవడం.. అందరికీ తెలిసిన విషయమే కదా..! ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు ఎక్కువవుతున్నాయి. అలాగే మన తెలుగు సినిమాలను కూడా బాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నిజానికి ఓ సినిమాని రీమేక్ చెయ్యడం అనేది చాలా సేఫ్ గేమ్ అని అంతా అనుకుంటూ ఉంటారు.
కానీ ఓ హిట్టు సినిమాని రీమేక్ చెయ్యడం అనేది.. అంత ఈజీ ఏమీ కాదు. రాష్ట్రానికి తగినట్టు ప్రజల అభిరుచి వేరుగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ గా దింపేస్తే మొదటికే మోసం వస్తుంది. అసలు ఒరిజినల్ ఎందుకు హిట్ అయ్యిందో.. ఆ సినిమాని రీమేక్ చేసే దర్శకనిర్మాతలు ఒకటికి రెండు సార్లు అనలైజ్ చేసుకోవాలి. స్క్రిప్ట్ పక్కాగా వచ్చిన తరువాతే దానిని సెట్స్ పైకి తీసుకెళ్ళాలి. సరే విషయాన్ని మరీ పర్సనల్ గా తీసుకోకుండా అసలు మేటర్ లోకి వచ్చేద్దాం. ఇప్పటివరకూ టాలీవుడ్లో ఎక్కువ రీమేక్ సినిమాల్లో నటించిన హీరో ఎవరు..ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించాడు.. వాటి పేర్లు ఏంటి? అనే దాని పై ఓ లుక్కేద్దాం రండి :