ఓ పదేళ్లు టాలీవుడ్ ని ఎలేయడం ఖాయం

కొంత మంది హీరోయిన్స్ ని లక్ పట్టుకొని లాక్కెళ్లి టాప్ సీట్ లో కూర్చోబెడుతుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక అదృష్టం అలాగే ఉంది. ఈ ఏడాది ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం 100కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఇక లేటెస్ట్ రిలీజ్ భీష్మ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రం నితిన్ కి ఏ స్థాయి హిట్ అందిస్తుంది అనేది ఓ వారం రోజులు ఆగితే తెలుస్తుంది.

పట్టుమని పాతికేళ్ళు కూడా లేని రష్మిక మొత్తం 10 సినిమాలు చేసింది. వాటిలో 6 తెలుగు సినిమాలు కాగా డియర్ కామ్రేడ్ మాత్రమే పరాజయం పొందింది. నాని తో చేసిన దేవదాస్ యావరేజ్ గా నిలిచింది. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు లేటెస్ట్ భీష్మ హిట్ మరియు బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో చేరాయి. దీనితో లక్కీ లేడీ అనే ముద్ర ఆమెకు పడిపోయింది. అలాగే బన్నీ-సుకుమార్ ల భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న రష్మిక ఎన్టీఆర్ 30వ చిత్రంలో కూడా నటించే అవకాశం కలదని వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా మరో పదేళ్లు రష్మిక టాలీవుడ్ ని ఎలేయడం ఖాయంగా కనిపిస్తుంది.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus