ఇదివరకు ఫారిన్ లొకేషన్ అంటే గోవా, బ్యాంకాక్ మహా అయితే మలేసియా. భారీ సినిమాలు ప్యారిస్, లండన్ అని కొత్త దేశాలు తిరగడం మొదలెట్టేంత వరకు సినిమాలన్నీ మ్యాక్సిమమ్ బ్యాంకాక్ కె పరిమితమయ్యాయి. అయితే కరోనా పుణ్యమా అని ఇప్పుడు ఫారిన్ లొకేషన్స్ అన్నీ మూతబడిపోయాయి. వెళ్లాలంటే భయం, మరీ తప్పదు అనుకుంటే తప్ప ఫారిన్ లొకేషన్స్ కి వెళ్లడం లేదు మనోళ్లు. ప్రభాస్ “రాధేశ్యామ్” టీమ్ మాత్రమే కంటిన్యుటీ కోసం తప్పక లండన్ వెళ్ళింది.
మిగతా సినిమాలన్నీ తమ లొకేషన్ ను మార్చేసుకొన్నాయి. ఇప్పుడు అందరూ దుబాయ్ కి పయనమవుతున్నారు. తమ కంట్రీకి వస్తే త్వరగా పర్మిషన్స్ ఇవ్వడమే కాక చాలా ఎలోవెన్సెస్ ప్రకటించింది దుబాయ్ ప్రభుత్వం. అందుకే ఇప్పుడు మన హీరోలు, నిర్మాణ సంస్థలు దుబాయ్ కి షిఫ్ట్ అవుతున్నారు. నితిన్ రంగ్ దే అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు మరియు ఒక పాట చిత్రీకరణ కోసం ఆల్రెడీ అక్కడ మకాం వేశారు. ఇప్పుడు అదే తరహాలో మరికొంత మంది దుబాయ్ కి షూటింగ్స్ కోసం సిద్ధమవుతున్నారు.
కరోనా పుణ్యమా అని దుబాయ్ మన తెలుగు దర్శకనిర్మాతలకు బ్యాంకాక్ లా అయిపొతుందేమో. అయితే.. అన్ని సినిమాలు అక్కడే షూట్ చేస్తే జనాలకి లొకేషన్ బోర్ కొట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి మన క్రియేటివ్ డైరెక్టర్స్ ఈ సమస్యను ఎలా అధిగమిస్తారా చూడాలి.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?