లెక్కలు మార్చేసిన హీరోయిన్.. నంబర్ వన్ ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుండగా ఆ హీరోయిన్లలో కొందరు హీరోయిన్లు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో సక్సెస్ అవుతున్నారు. ఏడాది క్రితం వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డే, రష్మిక, సమంత, కృతిశెట్టి మధ్య గట్టి పోటీ నడిచింది. మరికొన్ని సంవత్సరాల పాటు ఈ హీరోయిన్లదే హవా అని కామెంట్లు వినిపించడం గమనార్హం. అయితే ఇప్పుడు మాత్రం ప్రేక్షకులు శ్రీలీలపై అభిమానాన్ని చాటుకుంటున్నారు.

శ్రీలీల హీరోయిన్ గా నటిస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ తెరపైకి వస్తుండగా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో శ్రీలీల నటిస్తున్నారు. అందంతో పాటు అద్భుతంగా డ్యాన్స్ చేసే ప్రతిభ ఉండటం శ్రీలీలకు ప్లస్ అవుతోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో, బాలయ్య అనిల్ కాంబో మూవీలో శ్రీలీల నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రం శ్రీలీల దూకుడుకు ఇప్పట్లో బ్రేకులు పడవని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సోషల్ మీడియాలో శ్రీలీలకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. క్యూట్ లుక్స్ తో శ్రీలీల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. తరచూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ శ్రీలీల రెండు చేతులా సంపాదిస్తున్నారు. హైట్ కూడా శ్రీలీలకు ప్లస్ అవుతోందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇతర భాషల నుంచి కూడా శ్రీలీలకు ఆఫర్లు వస్తున్నాయి. చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం శ్రీలీలకు ఒక విధంగా ప్లస్ అయింది. శ్రీలీల పారితోషికం సైతం అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం కోటిన్నర రూపాయల రేంజ్ లో ఈమె రెమ్యునరేషన్ ఉంది. స్టార్ డైరెక్టర్లు శ్రీలీలకు మరిన్ని ఆఫర్లు ఇస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus