సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదు అనే చెప్పాలి. 2025 లోకి ఎంట్రీ ఇవ్వగానే అపర్ణ మల్లాది, సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్, నటుడు యోగేష్ మహాజన్, నిర్మాత మనో అక్కినేని, జయశీలన్,మలయాళ దర్శకుడు షఫీ,స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తల్లి లివి సురేష్ బాబు, అలాగే రానా అమ్మమ్మ రాజేశ్వరి,నిర్మాత వేద రాజు టింబర్ వంటి వారు మరణించారు. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండా మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే..నిర్మాత కేపీ చౌదరి (K P Chowdary) ఈరోజు(సోమవారం నాడు) ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. గోవాలో ఈయన మరణించినట్లు తెలుస్తుంది. మొన్నామధ్య డ్రగ్స్ కేసులో ఇతను అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇతని మొబైల్..లో టాలీవుడ్ కు చెందిన ఎంతో మంది సినీ ప్రముఖుల వివరాలు ఉన్నట్టు.. వారికి ఇతను డ్రగ్స్ సరఫరా చేసినట్లు నార్సింగి పోలీసులు వెల్లడించడం జరిగింది. కేపీ చౌదరి మొబైల్ డేటాలో అషు రెడ్డి, సురేఖ వాణి వంటి వారి డీటెయిల్స్ కూడా ఉన్నట్టు రివీల్ అవ్వడం జరిగింది.
ఇక కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇతను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడట.ఆ ఒత్తిడిని తట్టుకోలేక.. ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక కేపీ చౌదరి ‘కబాలి’ వంటి పలు డబ్బింగ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే పలు తెలుగు సినిమాలకి కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు.