Tollywood: ఆ విషయంలో స్టార్స్ మధ్య పోలికే లేదుగా!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లకు గుర్తింపు ఉంది. ఈ హీరోల సినిమాలకు ఇప్పటికీ ప్రేక్షకాదరణ దక్కుతోంది. ఈ మధ్య కాలంలో చిరంజీవి ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో విజయాలను అందుకుంటే బాలకృష్ణ అఖండ సినిమాతో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. వెంకటేష్ నారప్ప, దృశ్యం2 సినిమాలతో విజయాలను అందుకోగా నాగార్జున బంగార్రాజు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

అయితే కథల ఎంపిక విషయంలో ఒక్కో హీరో ఒక్కో రూట్ ను ఫాలో అవుతుండటం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో రీమేక్ కథలలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండగా అదే సమయంలో తన సినిమాలు మల్టీస్టారర్స్ గా తెరకెక్కేలా జాగ్రత్త పడుతున్నారు. క్లాస్, మాస్ అనే తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథలకు చిరంజీవి ఓటేస్తున్నారు.

స్టార్ హీరో బాలకృష్ణ అఖండ సక్సెస్ తర్వాత ఊరమాస్ కథాంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. గోపీచంద్ మలినేని కాంబో మూవీలో కూడా బాలయ్య పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో కూడా బాలయ్య ఇమేజ్ కు అనుగుణంగా ఉన్న సీన్లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ తనకు నచ్చే, నప్పే సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

కథలు నచ్చితే రీమేక్ సినిమాలకు కూడా వెంకటేష్ ఓటేస్తున్నారు. మాస్ కథల కంటే క్లాస్ కథలకే వెంకీ ఓకే చెబుతున్నారు. మరో స్టార్ హీరో నాగార్జున సోలో హీరోగా కంటే మల్టీస్టారర్ సినిమాలతో మెరుగైన ఫలితాలను అందుకుంటున్నారు. ప్రయోగాత్మక పాత్రలకు ఓటేస్తున్న నాగ్ రొటీన్ కు భిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్లకు నాగ్ ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నారు. ఈ సీనియర్ స్టార్ హీరోలలో ఒక్కో హీరో ఒక్కో తరహా కథలను ఎంపిక చేసుకుంటూ కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నారు.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus