తెలుగువాళ్లకు సీక్వెల్స్ మీద ఉన్న పట్టే వేరు. సాధారణంగా ఇండియన్ సినిమాల్లో మొదటి భాగం సూపర్ హిట్ అయినా, రెండో భాగం ఆ స్థాయిని అందుకోలేకపోవడమే ఎక్కువ. కానీ టాలీవుడ్ (Tollywood) మాత్రం ఈ సెంటిమెంట్‌ను తిరగరాసింది. ప్రతి సీక్వెల్‌లో కొత్తదనం చూపిస్తూ, మునుపటి సినిమాకంటే బెటర్‌గా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. ఈ ట్రెండ్‌కు బెంచ్‌మార్క్ పెట్టింది ‘బాహుబలి’ (Baahubali) సిరీస్. మొదటి భాగం ఒక క్లాసిక్‌గా నిలవగా, రెండో భాగం దాని కలెక్షన్లను మించి మరో స్థాయికి తీసుకెళ్లింది.
అదే తంతు ‘పుష్ప 2’ (Pushpa 2) విషయంలోనూ జరిగింది. అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫ్రాంచైజ్‌కి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మాస్ రెస్పాన్స్ వచ్చింది. ఇది టాలీవుడ్ ప్లానింగ్‌కి బ్రహ్మాండమైన ఉదాహరణ. కేవలం పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాల స్థాయిలోనూ టాలీవుడ్ సీక్వెల్ మ్యాజిక్ రిపీట్ అవుతోంది. ‘హిట్’ (HIT) సిరీస్, ‘మత్తు వదలరా’ (Mathu Vadalara), ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) వంటి సినిమాలు మొదటి భాగం పాయింట్‌ని మరింత పదునుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
టెక్నికల్‌గా, స్క్రిప్ట్ పరంగా మెచ్చుకోదగ్గ విధంగా ట్రీట్ చేయడమే టాలీవుడ్ సక్సెస్ కు ప్రధాన కారణం. ఇదే తరహా ట్రైలు ఇతర ఇండస్ట్రీలు చేస్తున్నా, ఫలితాలు మాత్రం భిన్నంగా వస్తున్నాయి. తమిళంలో ‘ఇండియన్ 2’ (Indian 2), మలయాళంలో ‘ఎంపురాన్’ (L2 Empuraan) లాంటి సినిమాలు భారీ అంచనాలతో వచ్చి, కథల బలహీనత వల్ల ఆశించిన స్థాయికి రాలేవు. ఇవి చూస్తే స్టార్ కాస్టింగ్ కంటే కథకు బలం ఉండాలన్న విషయం స్పష్టమవుతుంది.
ఇందుకే ఇప్పుడు టాలీవుడ్‌ను సీక్వెల్స్‌కు హబ్‌గా చూడటం కొత్తేమీ కాదు. మాస్, క్లాస్, థ్రిల్లర్, కామెడీ.. ఏ జానర్ అయినా మొదటి భాగం సక్సెస్ అవుతే, రెండో భాగానికి ప్రేక్షకుల్లో కన్ఫిడెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ‘బడ్జెట్’ కాదు, ‘బలమైన కథ’ సీక్వెల్‌ని నిలబెట్టేది అనే టాలీవుడ్ సిద్ధాంతం ఇప్పుడు పాన్ ఇండియా ప్రమాణంగా మారిపోతోంది. మరి రాబోయే సీక్వెల్ సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ అవుతాయో చూడాలి.