షూటింగ్ లకు ప్రభుత్వం పెర్మిషన్లు ఇచ్చేసింది. తక్కువ క్యాస్ట్ అండ్ క్రూతో .. సామజిక దూరం పాటిస్తూ.. షూటింగ్ లు చేసుకోవచ్చు అని ప్రభుత్వం వెల్లడించింది. అయితే పెద్ద సినిమాల విషయంలో అది సాధ్యం కావట్లేదు అనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. మెల్లగా షూటింగ్ లు మొదలు పెడితే.. ఓ నెల రోజుల గ్యాప్లో థియేటర్లు కూడా ఓపెన్ చేయించాలని సినీ ప్రముఖులు భావించారు. కానీ అది కూడా అసాధ్యమని వారు డిసైడ్ అయిపోయారు.
షూటింగ్ లకు పెర్మిషన్ తెచ్చుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి వారు ఎంతో ప్రయత్నించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మీటింగ్ లు ఏర్పాటు చేసి.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను అలాగే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ను కలిసి షూటింగ్ లకు పర్మిషన్లు తెచ్చుకున్నారు. అంత కష్టపడినా ఉపయోగం లేకపోయింది. వైరస్ మహమ్మారి అంత కంతకు విజృంభిస్తూనే ఉంది. దీంతో పెద్ద హీరోలు షూటింగ్ లకు హాజరుకావడానికి వెనకడుగు వేస్తున్నారు.
చిన్న సినిమాలకు అయితే పర్వాలేదు … కానీ పెద్ద సినిమాల విషయంలో అలా కాదు. ఇతర రాష్ట్రాల నుండీ ఆర్టిస్ట్ లను తీసుకురావాలి. వారి స్టేయింగ్ కోసం ఏర్పాట్లు చెయ్యాలి. తక్కువ మందితో షూటింగ్ లు జరగని పని. శానిటైజర్, మాస్క్ లు వంటివి ఏర్పాట్లు చెయ్యాలి.ఇలా చాలా తతంగం ఉంది. దీంతో ఆగష్టు నుండీ షూటింగ్ ల సందడి మొదలయ్యే అవకాశం ఉంది.అప్పటికి కనీసం నటీ నటుల్లో భయం తగ్గి షూటింగ్ లకు వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి అలా జరిగే ఛాన్స్ ఉందో లేదో.