పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది ఈ మధ్య పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. దిల్ రాజు (Dil Raju) తమ్ముడి కొడుకు ఆశిష్, నితిన్ (Nithiin) ‘ఎక్స్ట్రా’ (Extra: Ordinary Man) సినిమాలో విలన్ గా చేసిన సుదేవ్ నాయర్ (Sudhev Nair) కూడా పెళ్లి చేసుకున్నాడు. వీరితో పాటు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), సీనియర్ హీరోయిన్ అక్ష (Aksha Pardasany), బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్(Vasanthi Krishnan), మీరా చోప్రా (Meera Chopra) కూడా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్ కి (Varalaxmi Sarathkumar) కూడా పెళ్లి ఫిక్స్ అయ్యింది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కూడా హీరోయిన్ రహస్యతో (Rahasya Gorak) ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తాజాగా సింగర్ హారికా నారాయణ్ (Harika Narayan ) కూడా పెళ్లి చేసుకుంది. ఇటీవల తన స్నేహితుడు పృధ్వినాథ్ తో కలిసి ఏడు అడుగులు వేయబోతున్నట్టు హారిక నారాయణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి కూడా సైలెంట్ గా ఘనంగా జరిగింది. ఆదివారం నాడు అనగా మార్చి 17న హారిక పెళ్లి జరిగినట్టు స్పష్టమవుతుంది.
మహేష్ బాబు (Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) , విజయ్ (Vijay Thalapathy) ‘వారసుడు’ (Varasudu) వంటి సినిమాల్లో హారిక నారాయణ్ పాటలు పాడింది. ఆమెకు సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక హారిక – పృథ్వీ నాథ్ ..ల పెళ్లి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సింగర్ రేవంత్ వంటివారు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు.