Jersey: ‘జెర్సీ’ కి ఫస్ట్ ఆప్షన్ నాని కాదట.. చాలా మందికి తెలియని విషయం ఇది..!

నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ మూవీ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. టాలీవుడ్లో వచ్చిన పాత్ బ్రేకింగ్ మూవీస్ లో ‘జెర్సీ’ కూడా ఒకటని చెప్పొచ్చు. క్రికెట్ ని, కొడుకుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి.. ఊహించని విధంగా క్రికెట్ ను ఎందుకు వదులుకున్నాడు, తర్వాత కొడుకు కోసం ఎందుకు మళ్ళీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు..

అనే ఇంట్రెస్టింగ్ లైన్ తో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఏ సన్నివేశం కూడా రెగ్యులర్ ఫార్మాట్లో ఉండదు. డైలాగులు కూడా చాలా కొత్తగా ఉంటాయి. క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. అదే ‘జెర్సీ’ కి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా నానికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ ‘జెర్సీ’ కి ఫస్ట్ ఆప్షన్ నాని కాదట.

అవును దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ కథని ముందుగా సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కి వినిపించాడట. వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇండియా మ్యాచ్ లు, ఐపీఎల్ మ్యాచ్ లకి అతను ప్రత్యేకంగా వెళ్లి ఎంజాయ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ‘జెర్సీ’ కథని ముందుగా వెంకీకి వినిపించాడు గౌతమ్. కానీ ఎందుకో ‘జెర్సీ’ ని వదులుకున్నాడు వెంకీ.

ఈ విషయాన్ని స్వయంగా వెంకీనే నానితో ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. కానీ ఎందుకు ‘జెర్సీ’ ని రిజెక్ట్ చేశాడు అనే విషయాన్ని బయట పెట్టలేదు. బహుశా క్లైమాక్స్ లో హీరో చనిపోవడం అనే పాయింట్ వద్ద వెంకీ అలోచించి ఉండవచ్చు. ఏదేమైనా నాని ‘జెర్సీ’ కి న్యాయం చేశాడు. అలాగే ‘జెర్సీ’ (Jersey) ప్రీ రిలీజ్ కి వెంకటేష్ కూడా గెస్ట్ గా వెళ్లి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus