Star Actress: టాలీవుడ్, మాలీవుడ్ లో స్టార్ హీరోయిన్..!

ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‏గా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న కేరళ కుట్టి. బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి కథానాయిక గానూ సక్సెస్ అయ్యింది.. బుల్లితెరపై.. వెండి తెరపై సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కేరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది.. ఈ క్యూటీ పేరు తెలుగు రాష్ట్రాల యూత్ కు సుపరిచితమే. న్యాచురల్ స్టార్ నాని, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోస్ సినిమాల్లో నటింటి ఓ గుర్తింపు తెచ్చుకుంది.

అయితే అందం, అభినయంతో ఆకట్టుకున్నప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు..అడపాదడపా సినిమాలతోనే సరిపెట్టుకుంది.. ఇంకా గుర్తుపట్టలేదా.. ఎస్ ఆ హీరోయిన్ నివేదా థామస్. 1995 నవంబర్ 2న కన్నూర్ ప్రాంతంలో జన్మించిన నివేదా.. 2002లో మలయాళం మూవీ ‘ఉత్తర’లో బాలనటిగా తెరంగేట్రం చేసింది..ఆ తర్వాత సన్ టీవీలో అప్పట్లో ప్రసారమైన మై డియర్ భూతం సీరియల్లో నటించింది. బాలనటిగా అలరించిన ఈ చిన్నది.. మలయాళంలో అనేక చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది.

2016లో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ తో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో నివేద తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా, దర్బార్, వి, వకీల్ సాబ్, మీట్ క్యూట్, శాకిని డాకిని చిత్రాల్లో ఆ తర్వాత మలయాళంలో కూడా వరుస సినిమాలు చేసింది.. తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది (Actress) నివేదా. ఇక ఈ ఏడాది ఎంతడా సాజి అనే మలయాళ మూవీలో కనిపించింది.

అలాగే తెలుగులో శాకిని డాకిని చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ క్రేజ్ ఉంది.. ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన గురించి అన్ని విషయాలను నెట్టింట పంచుకుంటుంది.. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తుంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus