Devara: ఎన్టీఆర్‎కు రెండో సారి అత్తగా నటించనున్న హీరోయిన్!

టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కొరటాల శివ. కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి ఆయనకు అపజయమే ఎదురు కాలేదు. కానీ ఆచార్య సినిమా ఆయన జోరుకు బ్రేకులు వేసింది. అప్పటి వరకు ఎదురు లేని కొరటాల ఖాతాలో తొలి ఫ్లాప్ పడింది. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించినా సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. నిజం చెప్పాలంటే ఆ సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిందనే చెప్పాలి.

దీంతో ఎలాగైనా ఈ సారి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని కొరటాల కసిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజా చిత్రం దేవర కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్, జాన్వీతో తెరకెక్కిస్తున్నారు. మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఇస్తూ సినిమాపై క్రేజ్ మరింత పెంచుతున్నారు. ప్రస్తుతం దేవర ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఎన్టీఆర్ లుక్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియజేస్తుంది. దేవర ( Devara) సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారన్న టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ కపూర్ కన్ఫాం అయిన సంగతి తెలిసిందే. రెండో హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు కొరటాల శివ ఇందుకు సంబంధించిన కొత్త అప్డేట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో మరో కీలకపాత్రకు సంబంధించిన విషయం వైరల్ అవుతోంది. దేవర సినిమాలో జూ. ఎన్టీఆర్ కు అత్త పాత్ర హైలట్ కానుందట. ఈ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణను సెలక్ట్ చేశారట కొరటాల.

ఎన్టీఆర్, రమ్యకృష్ణ కలిసి ఇప్పటికే నా అల్లుడు సినిమాలో చేశారు. అప్పట్లో ఆ కాంబినేషన్ కు మంచి మార్కులే పడ్డాయి. మళ్లీ ఇన్నాళ్లకు దేవర సినిమాలో కూడా అత్తగా రమ్యకృష్ణ నటిస్తారని టాక్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్ అమ్మగా రమ్యకృష్ణ నటిస్తుందట. ఈ సినిమా ఇంటర్వెల్ తర్వాత కథ మొత్తం కీలక మలుపు తిరగబోతుందని అప్పుడే రమ్యకృష్ణ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. రమ్యకృష్ణ పాత్రలో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus