సినీ పరిశ్రమలో ఈ మధ్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది సినిమా వాళ్ళు మరణించారు. ‘యజ్ఞం’ దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి, కీరవాణి తండ్రి శివశక్తి దత్తా వంటి వారు మరణించారు. ఆ షాక్..ల నుండి టాలీవుడ్ ఇంకా బయటపడకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
తెలుగు సినిమా పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఓ దర్శకుడు.. తన సినిమా ప్రివ్యూను చూస్తుండగానే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే.. దర్శకుడు సండ్రు నాగేష్ అలియాస్ రాంబాబు ‘బ్రహ్మాండ’ అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. తన సినిమా ప్రివ్యూ వేసుకుని చూస్తుండగా అనుకోకుండా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కుప్పకూలిపోయాడు. తర్వాత అతన్ని హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూనే అతను మరణించడం జరిగింది. అతని వయసు కేవలం 47 ఏళ్లు మాత్రమే కావడం బాధాకరం.
తన సినిమా రిలీజ్ కి సరిగ్గా వారం రోజుల ముందు అతను మరణించడం అత్యంత బాధాకరం.4 రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉన్న ప్రసాద్ ల్యాబ్‌స్లో ఈ విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటీమణి ఆమని ప్రధాన పాత్రలో ‘బ్రహ్మాండ’ రూపొందింది. జూలై 18న సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇంతలో ఇలా జరిగింది. రాంబాబు దాదాపు 150 సినిమాలకి, 60 టీవీ సీరియళ్ళకు కో-డైరెక్టర్‌గా పనిచేశారు.’అంతరంగాలు’ ‘అన్వేషణ’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ కి ఆయన పనిచేశారు.