ఇప్పుడైతే డిజిటల్ అయిపోయింది. సినిమాలను హార్డ్ డిస్క్ వంటి వాటిలో సేవ్ చేసుకుంటున్నారు. తర్వాత క్యూబ్..లు వంటి వాటికి ఎక్కించి తర్వాత డైరెక్ట్ గా థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇలాంటి సదుపాయాలు ఉండేవి కాదు. అప్పట్లో ఎంత షూటింగ్ చేస్తే అంతా కెమెరా రీల్స్ రూపంలో సేవ్ చేసుకుని.. తర్వాత వాటిని కాపీలుగా తీసి డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఆ ప్రింట్లు ప్రతి థియేటర్ కి రీచ్ అయ్యే వరకు దర్శకనిర్మాతల్లో టెన్షనే.
ఈ విషయాన్ని చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆఫ్ ది రికార్డులో షూటింగ్ పూర్తయిన ప్రతి రోజు రీల్ కాన్స్..ని (ప్రింట్లు) ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉండేవారు. ఒకవేళ అవి కనిపించకపోతే యూనిట్ సభ్యులని నిర్మాతలు తిట్టిపోసేవారు. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే.. గతంలో ఓ సినిమా షూటింగ్ కోసం ఔట్ డోర్ లొకేషన్ వెళ్లిన టీం రీల్ కాన్స్ ను వదిలేసి ఎయిర్పోర్ట్ వరకు వెళ్లిపోయిందట.
వివరాల్లోకి వెళితే.. 1998 జూలై 10న ‘కన్యాదానం’ అనే సినిమా మొదలైంది.శ్రీకాంత్, ఉపేంద్ర హీరోలుగా నటించిన ఈ సినిమాని ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. అంబికా కృష్ణ నిర్మాత. ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. అయితే ఒకసారి టీం అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు టీం రీల్ కాన్స్ ను హోటల్ లో మర్చిపోయి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళిపోయిందట. అయితే తర్వాత చెక్ చేసుకోగా రీల్ కాన్స్ కనిపించడం లేదని అంతా కంగారు పడ్డారు.
దీంతో నిర్మాత అంబికా కృష్ణ యూనిట్ సభ్యులపై చిందులు తొక్కారట. తర్వాత హోటల్లో మర్చిపోయినట్టు గుర్తించి… హోటల్ అధికారులను సంప్రదించారట. ఫ్లైట్ టైం మరో 4 గంటలు ఉండటంతో 2 కార్స్ మాట్లాడి అందులో రీల్ కాన్స్ ని తెప్పించుకున్నారట. అప్పటివరకు షూట్ చేసిన ఫుటేజీ మొత్తం అందులోనే ఉందట. అది కనుక మిస్ అయితే నిర్మాత పెట్టిన డబ్బంతా వేస్ట్ అయిపోయేది. దర్శకుడి కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయేది.