టాలీవుడ్ ను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. జనవరి నెలలో వారసుడు సినిమా ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు, ఇడియట్ గేయ రచయిత పెద్దాడ మూర్తి, ఒకప్పటి హీరోయిన్ జమున, యాంకర్ విష్ణు ప్రియ తల్లి, యాంకర్ రీతు చౌదరి తండ్రి, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి వంటి వారు మరణించిన సంగతి తెలిసిందే. నటుడు నందమూరి తారకరత్న అయితే ప్రాణాలతో ఫైట్ చేస్తున్నాడు. వీటి నుండీ టాలీవుడ్ ఇంకా కోలుకోక ముందే మరో దర్శకుడు కన్నుమూశాడు.
వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ డైరెక్టర్ సాగర్ ఈరోజు మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ … వస్తున్న ఈయన ఈరోజు చెన్నైలోని ఆయన నివాసంలో ఉదయం 5 గంటల 20 నిమిషాలకు చనిపోయినట్టు తెలుస్తుంది. సాగర్ మరణవార్తను ఆయన కుమారుడు చందు వెల్లడించారు. రాకాసి లోయ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాగర్ అటు తర్వాత అమ్మదొంగ, స్టూవర్ట్ పురం దొంగలు, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నంబర్ 1, అన్వేషణ(2002), ఓసి నా మరదలా, డాకు వంటి చిత్రాలను తెరకెక్కించారు.
తెలుగు సినిమా దర్శకులు సంఘానికి మూడు సార్లు అధ్యక్షుడిగా చేశారు ఈయన. గతంలో రవితేజను రూ.3 లక్షల హీరో అంటూ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు.వి.వి.వినాయక్ , శ్రీను వైట్ల వంటి స్టార్ డైరెక్టర్లు సాగర్ వద్ద అసిస్టెంట్లుగా పనిచేశారు.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?