నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో `ఆ నలుగురు` ఖచ్చితంగా ఉంటుంది. చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ఆమని జంటగా నటించారు. కోటిన్నర రూపాయిలతో ఈ మూవీని నిర్మించి.. 2004 డిసెంబరు 9న విడుదల చేశారు. ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడం, పెద్ద పెద్ద స్టార్స్ ఎవరూ లేకపోవడంతో.. విడుదలైన రోజున ఈ సినిమా థియేటర్లకు దాదాపు ఖాళీగానే ఉన్నాయి.
రెండు వారాల దాకా ఈ సినిమావైపు ప్రేక్షకులు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ, ఆ తర్వాత మౌత్ టాక్ తో సినిమా పుంజుకుంది. హఠాత్తుగా విడుదలైన అన్ని చోట్ల హైస్ ఫుల్ బోర్డులు పడటం ప్రారంభం అయ్యాయి. కమర్షియల్ గా ఈ సినిమా మంచి విజయం సాధించింది. విమర్శకులు సైతం `ఆ నలుగురు` మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ వన్ మెన్ షో చేసేశారు. తనదైన నటన, హావభావాలతో అందరినీ ఆకట్టుకున్నాడు.
ఈ సినిమా ప్రేక్షకుల మనసును ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా మూవీ క్లైమాక్స్ అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. అయితే నిజానికి ఈ సినిమాను మొదట టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణతో చేయాలని అనుకున్నారట. ఈ నేపథ్యంలోనే కృష్ణను కలిసి కథ కూడా వినిపించాడట దర్శకుడు. కథ నచ్చినా.. ఫుల్ లెంగ్త్ రోల్స్ ని చేసేంత శక్తి ఇప్ప్పుడు తనకు లేదని చెప్పి కృష్ణ సున్నితంగా ఈ మూవీని తిరస్కరించారు.
ఆ తర్వాత ఆ నలుగురు (Aa Naluguru) ప్రాజెక్ట్ రాజేంద్ర ప్రసాద్ చేతికి వచ్చింది. ఇక రాజేంద్ర ప్రసాద్ కు జోడీగా లక్ష్మి, గౌతమి, భానుప్రియ, రోజా ఇలా ఎంతో మంది సీనియర్ హీరోయిన్లను సంప్రదించారు. అందరూ కథ బావుందని మెచ్చుకున్నవారు. కానీ ఎవరూ కాల్షీట్లు ఇవ్వలేదు. చివరకు రాజేంద్ర ప్రసాద్ సలహాతో ఆమనిని సంప్రదించగా.. ఆమె వెంటనే ఓకే చెప్పారు. మొత్తానికి ఎన్నో అడ్డంకులను దాట్టుకుని పట్టాలెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయం సాధించింది.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు