Godavari: 17 ఏళ్ళ బ్లాక్ బస్టర్ మూవీ ‘గోదావరి’ ని మిస్ చేసుకున్న స్టార్ హీరో..!

  • May 19, 2023 / 11:57 PM IST

సుమంత్, కమలిని ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గోదావరి’. ‘ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది’.. అనేది ఈ సినిమా క్యాప్షన్. పవన్ కళ్యాణ్ తో ‘తొలిప్రేమ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించిన జి.వి.జి రాజు ఈ చిత్రానికి నిర్మాత. 2006 వ సంవత్సరం మే 19న ఈ చిత్రం విడుదలయ్యింది. ‘పోకిరి’ వంటి పెద్ద సినిమాల నడుమ విడుదలైన ఈ చిత్రం సైలెంట్ గా హిట్టు కొట్టేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ లభించింది.

దీంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో బాగానే చూసారు.. ఇప్పటికీ బుల్లితెరపై కూడా మిస్ కాకుండా చూస్తున్నారు. ఇది ఒక క్లాసిక్ అని చెప్పొచ్చు.ప్రఖ్యాత ఐ.ఎం.డి.బి లో ఈ చిత్రానికి 7.9/ 10 రేటింగ్ ఉండటం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 17 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అందుకే ‘#17YearsForGodavari’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

హీరో సుమంత్ కూడా (Godavari) ఈ చిత్రం పోస్టర్ ను పోస్ట్ చేసి ‘ఈరోజుతో 17’ అంటూ రాసుకొచ్చాడు. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కె.ఎం.రాధాకృష్ణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇదిలా ఉండగా.. ‘గోదావరి’ చిత్రానికి హీరోగా ఫస్ట్ ఛాయిస్ సుమంత్ కాదట. ఓ స్టార్ హీరో బిజీగా ఉండి ఈ ప్రాజెక్ట్ చేయలేకపోవడంతో సుమంత్ ను తీసుకున్నాడట శేఖర్ కమ్ముల. ‘గోదావరి’ ని మిస్ చేసుకున్న హీరో మరెవరో కాదు రవితేజ.

అవును ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ సినిమా చూసినప్పుడు ‘గోదావరి’ కథకి రవితేజ అయితే బాగుంటాడు అని దర్శకుడు శేఖర్ కమ్ముల అనుకున్నాడట. కానీ రవితేజ కాల్ షీట్లు బిజీగా ఉండటంతో సుమంత్ ను ఫైనల్ చేశాడు. రవితేజ ఏమో కానీ.. సుమంత్ మాత్రం ‘గోదావరి’ కి మంచి ఆప్షన్ అనిపించాడు. ఈ సినిమాలో అతను చాలా బాగా నటించాడు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus