Dasara Movie: ‘దసరా’ దర్శకుడికి ‘నో’ చెప్పిన దురదృష్టవంతుడైన ఆ స్టార్ హీరో ఎవరంటే..?

ఓ యాడ్‌లో చెప్పినట్టు.. ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే.. తెలుగు రాష్ట్రాల్లో నాని ‘దసరా’ జాతర జరుగుతుంది.. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ బరిలో కలెక్షన్ల కనక వర్షం కురుస్తుంది.. ఎక్కడ విన్నా ‘దసరా’ పాటలు, ఎవరి నోటా విన్నా ‘దసరా’ సినిమా మాటే.. అంతలా నాని మేనియా నడుస్తోంది.. నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా.. కొత్త కుర్రాడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘దసరా’.. నాని కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ఇది..

భారీ అంచనాలతో మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.. నైజాంలో ఫస్ట్ డే రికార్డ్ రేంజ్ వసూళ్లు రాబట్టింది.. యూఎస్‌లోనూ 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసేసింది.. ఇక ఏపీలో దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు నాని.. సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో ముందు నుంచీ చూస్తూనే ఉన్నాం.. ఇక తన నటనకి అంతా ఫిదా అయిపోయారు.. కీర్తి సురేష్ అయితే బీభత్సం అంటున్నారు..

కొత్త డైరెక్టర్‌తో హిట్ కొట్టి తన జడ్జిమెంట్ కరెక్ట్ అని మరోసారి నిరూపించాడు నేచురల్ స్టార్.. ఇదిలా ఉంటే అసలు శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ కథను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం రాసుకున్నాడట.. ‘రంగస్థలం’ లో చరణ్ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది.. అలాగే విలేజ్ నేపథ్యం.. పైగా సుకుమార్ దగ్గర ఆ సినిమాకి అసిస్టెంట్‌గా పని చేశాడు కాబట్టి చెర్రీ అయితే బాగుంటుంది అనుకున్నాడట.. కాకపోతే పెద్ద హీరో కదా.. తనకు అవకాశమిస్తాడో లేదో అనే సందేహంతో చెర్రీని కలవలేదట..

ఇక నితిన్ అయితే తన బడ్జెట్‌కి బెటర్ అని కలిసి కథ చెప్పాడట.. కొత్త కుర్రాడు కావడంతో నితిన్ బాబు ‘దసరా’ (Dasara) రిజెక్ట్ చేశాడంట.. ఇక నాని దగ్గరకు వెళ్లడం.. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా డెమో షూట్ చేసుకుని రమ్మనడం.. అది నచ్చడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కడం.. ఇప్పుడు సూపర్ హిట్ కొట్టడం చకచకా జరిగిపోయాయి.. నితిన్ ‘దసరా’ కథను రిజెక్ట్ చేశాడని తెలిసి.. ‘దురదృష్టం అంటే నీదే బ్రో.. మంచి మూవీ మిస్ చేసుకున్నావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus