విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు లక్ష్మి, కాజల్, అంజలి, అను ఇమ్మాన్యుయేల్, కల్యాణ్‌రామ్, రకుల్‌ప్రీత్ సింగ్, మంచు విష్ణు, గోపీచంద్, అనసూయ తదితరులు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు.
ఎన్టీఆర్ – ‘అందరికీ దసరా శుభాకాంక్షలు’.
అల్లు అర్జున్ – ‘దసరా శుభాకాంక్షలు’. 
రకుల్‌ప్రీత్ సింగ్ – ‘అందరికీ దసరా శుభాకాంక్షలు. మీలోని ప్రతికూలతను చంపి.. అనుకూలతను నింపుకోండి’. 
కాజల్ – ‘అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ పండగలోని అందం, ఆనందం మీతో ఉండాలని కోరుకుంటున్నా’. 
అను ఇమ్మాన్యుయేల్ – ‘హ్యాపీ దసరా’. 
అనసూయ – ‘అందరికీ విజయదశమి శుభాకాంక్షలు’. 
అంజలి – ‘దసరా శుభాకాంక్షలు. మీ అందరి జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటున్నా’. 
గోపీచంద్ – ‘మీకు, మీరు ప్రేమించే వారికి దసరా శుభాకాంక్షలు’. 
కల్యాణ్‌రామ్ – ‘మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు’. 
మంచు విష్ణు – ‘ప్రపంచంలోని నా సోదర సోదరీమణులు శక్తిమంతులు కావాలని కోరుకుంటున్నా’. 
మంచు లక్ష్మి – ‘చెడుని ఓడించి.. గెలిచిన మంచి విజయాన్ని అందరం కలిసి వేడుకగా జరుపుకొందాం. మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు’. 
మంచు మనోజ్ – ‘ఈ పండగ సీజన్ మీ అందరికీ సంతోషం, ఆరోగ్యం, సంపదలు ఇవ్వాలని కోరుకుంటున్నా’. 
తమన్ – ‘అందరికీ దసరా శుభాకాంక్షలు’. 
నివేదా థామస్ – ‘ప్రతి ఒక్కరికీ దసరా శుభాకాంక్షలు’.
