Balakrishna: ఆ హీరోలపై మండిపడుతున్న బాలయ్య ఫ్యాన్స్.. కానీ?

ఈ నెల 10వ తేదీన స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కాగా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులు బాలయ్య పుట్టినరోజు వేడుకను జరుపుకోవడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా గోపీచంద్ మలినేని సినిమా నుంచి టీజర్ రిలీజ్ కాగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే బాలయ్య పుట్టినరోజును టాలీవుడ్ స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు పెద్దగా పట్టించుకోలేదు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోలు, డైరెక్టర్లు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విష్ చేయలేదు. బాలయ్యకు సన్నిహితులైన హీరోలు సైతం బాలయ్య పుట్టినరోజును పట్టించుకోలేదు. చాలా తక్కువమంది సెలబ్రిటీలు మాత్రమే సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. స్టార్ హీరోలు బాలయ్య విషయంలో ఈ విధంగా ఎందుకు వ్యవహరించారో తెలియాల్సి ఉంది. అయితే బాలయ్య మాత్రం ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరనే సంగతి తెలిసిందే.

బాలయ్య విషయంలో స్టార్ హీరోలు వ్యవహరించిన తీరు బాలయ్య అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. గతేడాది అఖండ సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య అన్ స్టాపబుల్ షోతో సత్తా చాటారు. ఈ ఏడాది బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాతో సత్తా చాటుతానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అన్ స్టాపబుల్ సీజన్2 కూడా ఈ ఏడాదే మొదలుకానుంది. ఈ ఏడాది ఎండింగ్ లో ఆహా ఓటీటీలో ఈ షో ప్రసారం కానుందని సీజన్2 కు

చిరంజీవి, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ మరి కొందరు సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. అన్ స్టాపబుల్ సీజన్2 కూడా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య సినిమాలకు 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండగా అన్ స్టాపబుల్ షోకు మాత్రం 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus