ట్విట్టర్లో మిలినియర్స్ క్లబ్ లో చేరిన టాలీవుడ్ స్టార్స్
- June 29, 2017 / 01:03 PM ISTByFilmy Focus
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియా ప్రస్తుతం పవర్ ఫుల్ గా మారింది. ప్రధానంగా సినీ స్టార్స్ కి ఈ వేదిక చాలా ఉపయోగకరం అయింది. అభిమానులకు చేరాల్సిన విషయాన్నీ సూటిగా సుత్తిలేకుండా చెబుతున్నారు. ట్విట్టర్ ద్వారా స్టార్స్ ఫ్యాన్స్ టచ్ లో ఉంటున్నారు. అందుకే ఫాలోవర్స్ కూడా రోజురోజుకి పెరిగిపోతున్నారు. అలా ఒక మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ని రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రాస్ చేశారు. ఇదివరకు ఈ మార్క్ ని దాటిన టాలీవుడ్ స్టార్స్ లో పవన్ కల్యాణ్ (1.9 మిలియన్), అల్లు అర్జున్ (1 .4 మిలియన్) ఉన్నారు. అందరికంటే ఎక్కువ ఫాలోవర్స్ కలిగి ఉన్న తెలుగు నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు.
33 లక్షల మంది (3.3 మిలియన్) ఫాలోవర్స్ ని దక్కించుకొని ఈ మార్క్ చేరుకున్న తొలి టాలీవుడ్ స్టార్ గా రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు తెలుగు సినీ సెలబ్రిటీల్లో అత్యధికంగా రాజమౌళికి 34 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ట్విట్టర్లో చురుకుగా ఉండే హీరో రానాకి 2.9 మిలియన్లు, నాగార్జునను 2.7 మిలియన్ల మందిఫాలోవర్స్ ఉన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














